రాయుడు, ఓజా వచ్చేశారు | rayudu, ojha join in hyderabad | Sakshi
Sakshi News home page

రాయుడు, ఓజా వచ్చేశారు

Published Thu, Jul 20 2017 10:44 AM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

రాయుడు, ఓజా వచ్చేశారు - Sakshi

రాయుడు, ఓజా వచ్చేశారు

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు హైదరాబాద్‌ జట్టు కోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు ఈ నెల 24 నుంచి ఆగస్ట్‌ 2 వరకు జరుగుతాయి. ఇందులో తలపడే హైదరాబాద్‌ జట్టును బుధవారం ప్రకటించారు.

గత ఏడాది వరకు హైదరాబాద్‌కు దూరంగా ఉన్న అంబటి రాయుడు, ప్రజ్ఞాన్‌ ఓజా తిరిగి జట్టులోకి రావడం విశేషం. రాయుడు... ఆంధ్ర, బరోడా, విదర్భ జట్ల తరఫున ఆడగా, ఓజా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు ఇదే జట్టు రంజీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యే అవకాశం ఉండటంతో వీరిద్దరి పునరాగమనం ఖాయమైంది.

జట్టు: అంబటి రాయుడు, అక్షత్‌ రెడ్డి, బి. సందీప్, తన్మయ్‌ అగర్వాల్, ఠాకూర్‌ తిలక్‌వర్మ, ఆకాశ్‌ భండారి, ప్రజ్ఞాన్‌ ఓజా, సీవీ మి లింద్, రవికిరణ్, కె.సుమంత్, మెహదీ హసన్, ఆశిష్‌ రెడ్డి, విశాల్‌ శర్మ, రోహిత్‌ రా యుడు, ముదస్సిర్‌ హుస్సేన్‌. స్టాండ్‌ బైస్‌: పి.రోహిత్‌ రెడ్డి, శ్రవణ్‌ కుమార్, కోచ్‌: అర్జున్‌ యాదవ్‌.


హెచ్‌సీఏ సెలక్షన్స్‌ వాయిదా: నగరంలోని వివిధ మైదానాల్లో నేడు, రేపు జరగాల్సిన హెచ్‌సీఏ ఎ2–డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అలాగే రెండు రోజుల లీగ్‌ జట్ల కోసం హెచ్‌సీఏ నిర్వహించాలనుకున్న ఓపెన్‌ సెలక్షన్స్‌ కూడా వాయిదా పడ్డాయి. జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 24వ తేదీన సెలక్షన్స్‌ నిర్వహిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement