
‘డ్రా’తోనే ముగింపు
భారత్, విండీస్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ పర్యటనలో రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా భారత జట్టు ‘డ్రా’గా ముగించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఎలెవన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్లాక్‌వుడ్ (51) టాప్‌స్కోరర్‌గా నిలవగా, హాడ్జ్ (39 నాటౌట్), విశాల్ సింగ్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ఆంటిగ్వాలో జరుగుతుంది.