RCB Play Their First Practice Game Ahead of IPL 2022 - Sakshi
Sakshi News home page

IPL 2022: చెలరేగిన డుప్లెసిస్‌.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..!

Published Fri, Mar 25 2022 4:33 PM | Last Updated on Fri, Mar 25 2022 6:42 PM

RCB Play Their First Practice Game Ahead Of IPL 2022 - Sakshi

RCB Intra Squad Practice Match: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లు దుమ్మురేపారు. డుప్లెసిస్ ఎలెవన్‌, హర్షల్ పటేల్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగి ఆడటంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన డుప్లెసిస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా, ఛేదనలో హర్షల్‌ పటేల్‌ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 213 పరుగులు చేసి, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆర్సీబీ తరఫున డుప్లెసిస్‌ తొలి విజయాన్ని అందుకున్నాడు. 


ఈ సన్నాహక మ్యాచ్‌లో డుప్లెసిస్ (40 బంతుల్లో 76), షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్(59), సుయాశ్‌ ప్రభు దేశాయ్‌ (46 బంతుల్లో 87)లు అర్ధ సెంచరీలతో చెలరేగగా.. యువ ఆటగాడు అనూజ్ రావత్(46), సీనియర్‌ ప్లేయర్‌ దినేశ్ కార్తీక్(21 బంతుల్లో 49), డేవిడ్ విల్లే(17 బంతుల్లో 25)లు రాణించారు.  ఇక బౌలింగ్‌లో  ఆకాశ్ దీప్‌ 4 వికెట్లతో అదరగొట్టగా హర్షల్ పటేల్ 3, కర్ణ్ శర్మ 2 వికెట్లతో రాణించారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, డుప్లెసిస్‌ సారధ్యంలోని ఆర్సీబీ.. ఆదివారం (మార్చి 27) జరుగబోయే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.


చదవండి: ఐపీఎల్‌ 2022 ప్రారంభానికి ముందే సెంచరీ కొట్టిన సీఎస్‌కే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement