IPL 2022 DC VS MI: Tim David Received Picture From RCB Captain Faf du Plessis, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022 DC VS MI: టిమ్‌ డేవిడ్‌కు గిఫ్ట్‌ పంపిన ఆర్సీబీ కెప్టెన్‌..!

Published Sun, May 22 2022 12:09 PM | Last Updated on Sun, May 22 2022 12:53 PM

DC VS MI: Tim David Received Picture From Faf du Plessis - Sakshi

IPL 2022: ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్‌ ఫోర్‌కు చేరేలా చేసిన ముంబై ఇండియన్స్‌ హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌కు ఆర్సీబీ సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఓ అపురూప కానుక పంపాడు. తనతో పాటు విరాట్‌, మ్యాక్స్‌వెల్‌లు ముంబై కిట్‌లో ఉన్న ఫోటోను డుప్లెసిస్‌ టిమ్‌కు మెసేజ్‌ చేశాడు. ఈ విషయాన్ని టిమ్‌ స్వయంగా వెల్లడించాడు. సదరు ఫోటోను త్వరలోనే తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తానని టిమ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, నిన్న (మే 21) ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో టిమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (11 బంతుల్లో 34; 4 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆడి ముంబైని గెలిపించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్తును కన్ఫర్మ్‌ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్‌ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబైని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. 

మ్యాచ్‌ చేజారుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన టిమ్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ పాలిట విలనయ్యాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్‌ను ముగించగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫ‌ల్యంతో ఢిల్లీ ఓట‌మిపాలవగా, ఆర్సీబీ దర్జాగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కాగా, సింగపూర్‌కు చెందిన టిమ్‌ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో 8.25 కోట్ల‌కు కొనుగులు చేసింది. 
చదవండి: IPL 2022: ఢిల్లీని చిత్తు చేసిన ముంబై.. ఎగిరి గంతేసిన కోహ్లి.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement