కీలకమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌కు వరుణుడు అడ్డం పడ్డాడు. సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం జట్టు గురువారం లండన్ చేరుకుంది. శుక్రవారం వర్షంతో ప్రాక్టీస్ సాగలేదు. దాంతో ఆసీస్‌తో మ్యాచ్ సన్నాహానికి టీమిండియాకు శనివారం ఒక్క రోజే అందుబాటులో ఉంది. మరోవైపు భారత జట్టును బ్రిటన్‌లో భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ శుక్రవారం విందుకు ఆహ్వానించారు. కెప్టెన్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా జట్టు సభ్యులందరూ ఈ విందుకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment