ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌కు షాక్ | indian failed to score in practice match | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌కు షాక్

Published Tue, Feb 11 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

indian failed to score in practice match

 అబుదాబి: అండర్-19 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో యువ జట్టు ఓడింది. సోమవారం షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 45.5 ఓవర్లలో 209 పరుగులు చేసి ఆలౌటయ్యింది. దీపక్ హుడా (39), శ్రేయాస్ అయ్యర్ (31) రాణించారు. కెప్టెన్ విజయ్ జోల్ (25) నిరాశపరిచాడు. బినురా ఫెర్నాండోకు నాలుగు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో లంక ఆటగాళ్లు 48.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 212 పరుగులు చేసి నెగ్గారు. సమరవిక్రమ (82) అర్ధ సెంచరీ చేశాడు. శుక్రవారం నుంచి ప్రధాన టోర్నీ ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement