
న్యూఢిల్లీ: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలోని ఏకైక సన్నాహక మ్యాచ్ రద్దయింది. పార్ల్‌లోని బొలాండ్ పార్క్‌లో నిర్వహించాల్సిన ఈ మ్యాచ్ రద్దుకు అధికారిక కారణాలేమీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజులను పూర్తిగా భారత జట్టు సాధనకు కేటాయించారు.
దక్షిణాఫ్రికాలోని పేస్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని... నెట్స్‌లో ఆటగాళ్లకు సాయపడేందుకు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌తో పాటు, అవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), నవదీప్ సైనీ (ఢిల్లీ), బాసిల్ థంపి (కేరళ)లు దక్షిణాఫ్రికా వెళ్లనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు వన్డే మ్యాచ్‌ల వేళలను అరగంట ముందుకు జరిపేందుకు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment