పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు అన్ని జట్లకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత్ తమ సన్నాహాలను సంతృప్తిగా మొదలు పెట్టింది. మూడు రోజుల సాధన అనంతరం సోమవారం మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా తొలి పోరులో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. ఇతర బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (27; 1 ఫోర్, 1 సిక్స్), దీపక్ హుడా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... రోహిత్ (3), ఓపెనర్‌గా ఆడిన పంత్ (9) విఫలమయ్యారు. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్‡్షదీప్ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చహల్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment