Suryakumar Yadav Looks Terrific Batter Apt-For Mister 360 Player Vs ZIM - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: ఏమా కొట్టుడు.. 'మిస్టర్‌ 360' పేరు సార్థకం

Published Sun, Nov 6 2022 7:44 PM | Last Updated on Mon, Nov 7 2022 8:15 AM

Suryakumar Yadav Looks Terrific Batter Apt-For Mister 360 Player Vs ZIM - Sakshi

క్రికెట్‌లో కొందరు కొడుతుంటే చూడాలనిపిస్తుంటుంది. తమ కళాత్మక ఆటతీరుతో ఆటకే అందం తెచ్చిన ఆటగాళ్లను చూశాం. ఈ తరంలో కోహ్లి, విలియమ్సన్‌ లాంటి ఆటగాళ్లు ఇలాంటి కళాత్మక, సంప్రదాయ షాట్లతోనే రాణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం హిట్టింగ్‌నే మంత్రంగా జపిస్తూ ఆడుతుంటారు. వీళ్లందరిది ఒక శైలి అయితే మనకు తెలియని మూడో కోణం ఒకటి ఉంటుంది. బంతి పడితే చాలు కసితీరా బాదడమే.. అదీ మాములుగా కాదు.. క్రికెట్‌ గ్రౌండ్‌ సర్కిల్(360 డిగ్రీస్‌)లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి ఆటగాళ్లు కూడా అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకు చెందినవాడే టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌.

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఒక సంచలనం. చేసింది 25 బంతుల్లో 61 పరుగులే కావొచ్చు. కానీ అతను ఇన్నిం‍గ్స్‌ ఆడిన విధానం హైలైట్‌ అని చెప్పొచ్చు. శరీరాన్ని విల్లులా వంచుతూ గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతుంటే చూస్తున్న మనం వహ్వా అనుకుండా ఉండలేం. మాములుగా ఏ క్రికెటర్‌ అయినా తనకు సాధ్యమైనంత వరకు ఆడుతూ సిక్సర్లు, ఫోర్లు బాదడం చూస్తుంటాం.

కానీ సూర్య ఇన్నింగ్స్‌ చూస్తే ఎటు పడితే అటు యధేచ్చగా షాట్లు కొట్టాడు. బ్యాక్‌వర్డ్‌, అప్పర్‌ కట్‌, లాంగాన్‌, లాంగాఫ్‌, మిడాన్‌, మిడాఫ్‌, స్క్వేర్‌లెగ్‌, కవర్‌ డ్రైవ్‌.. ఇలా క్రికెట్‌లో ఎన్ని షాట్లు ఉంటే అన్ని షాట్లను సూర్య ట్రై చేశాడు. సూర్యకుమార్‌ కొట్టుడు చూస్తుంటే.. ఏమా కొట్టుడు అనుకుంటూనే అతని శరీరంలో స్రింగులేమైనా ఉన్నాయా అన్న డౌట్‌ రాక మానదు. 

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మిస్టర్‌ 360కి పెట్టింది పేరు. అతను బ్యాటింగ్‌ చేస్తుంటే గ్రౌండ్‌కు నలుమూలలా షాట్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతన్ని మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని అభివర్ణిస్తారు. కానీ సూర్యకుమార్‌ ఇవాళ ఏబీ డివిలియర్స్‌నే తలదన్నేలా కనిపిస్తున్నాడు. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడుతూ మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అనే పేరును సార్థకం చేసుకున్నట్లగానే అనిపిస్తుంది. 

అందరూ ఊహించినట్లే టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు తురుపుముక్క అయ్యాడు. అసలే కోహ్లి భీకరమైన ఫామ్‌లో ఉండడం సానుకూలాంశమనుకుంటే అగ్నికి వాయువు తోడైనట్లు సూర్యకుమార్‌ తన కెరీర్‌లోనే ఉన్నత ఫామ్‌ను కనబరుస్తూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈసారి సూర్యకుమార్‌ టీమిండియాకు టి20 ప్రపంచకప్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. 

చదవండి: సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సవాలే.. యువీలాగే సూర్య దంచికొడితే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement