టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం వరుసగా రెండో విజయంపై కన్నేసింది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికి మ్యాచ్ జరిగితే మాత్రం ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండడం ఖాయం. భారత్-పాక్ మ్యాచ్ అంటే జట్టుగానే గాక ఆటగాళ్ల మధ్య వైరం కూడా గమ్మత్తుగా ఉంటుంది.
-సాక్షి, వెబ్‌డెస్క్
అందుకే ఏకంగా ఐసీసీనే భారత్-పాక్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏయే ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు ఉంటుందనే అంశంలో ఒక లిస్ట్ విడుదల చేసింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వర్సెస్ షాహిన్ అఫ్రిది, ఇండియా డెత్ బౌలర్స్ వర్సెస్ ఆసిఫ్ అలీ, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ షాదాబ్ ఖాన్ అంటూ పేర్కొంది.
అఫ్రిది మెరుస్తాడా.. రోహిత్, రాహుల్‌కు దాసోహమంటాడా?
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో షాహిన్ అఫ్రిది కేఎల్ రాహుల్, రోహిత్ వికెట్లను తీశాడు. తన ఇన్‌స్వింగర్స్‌తో ముప్పతిప్పలు పెట్టిన అఫ్రిది హిట్‌మ్యాన్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్‌ను 3 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి వికెట్ కూడా తీశాడు. మరి ఈసారి అఫ్రిది ఇన్‌స్వింగర్స్‌కు రాహుల్, రోహిత్‌లు ఎలా సమాధానమిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితేమోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరమైన అఫ్రిది నేరుగా టి20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగాడు. మరి పాత షాహిన్‌ను గుర్తుచేస్తాడా లేక రోహిత్, రాహుల్‌కు దాసోహమంటాడా అనేది వేచి చూడాలి.
డెత్ బౌలర్స్ వర్సెస్ ఆపిఫ్ అలీ
టీమిండియాకు దినేశ్ కార్తిక్ ఎలా ఫినిషర్ పాత్ర పోషిస్తాడో.. అచ్చం పాకిస్తాన్‌కు కూడా ఆసిఫ్ అలీ అలాంటి పాత్రనే పోషిస్తున్నాడు. డెత్ ఓవర్లలో ఆసిప్ అలీ స్ట్రైక్‌రేట్ వందకు పైగా ఉంది. మంచి హార్డ్‌హిట్టర్‌గా పేరు పొందిన ఆసిఫ్ అలీ డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లను ముప్పతిప్పలు పెడతాడా లేక ఊసురుమనిపిస్తాడా అనేది చూడాలి.
బాబార్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్
వాస్తవానికి ఇక్కడ మహ్మద్ షమీ పేరు ఉండాలి. కానీ స్వింగ్ బౌలింగ్ పెట్టింది పేరు భువనేశ్వర్ కుమార్. ఎంత కాదన్నా ఆరంభ ఓవర్లలో భువీ సూపర్ బౌలింగ్ చేస్తాడు. ఇన్‌స్వింగ్‌తో ఎలాంటి బ్యాటర్లనైనా ముప్పతిప్పలు పెట్టి వికెట్లు తీయగలడు. అందుకే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు భువీ సరైన బౌలర్ అని చెప్పొచ్చు. మరి వీరిని భువీ ఆడుకుంటాడా.. లేక భువీకే ఇద్దరు ఓపెనర్లు ముచ్చెమటలు పట్టిస్తారా అనేది చూడాలి. ఇక గతేడాది టి20 ప్రపంచకప్‌లో టీమిండియా విధించి 151 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరే ఊదేసిన విషయం అంత ఫ్యాన్స్ అంత తొందరగా మరిచిపోరు.
సూర్యకుమార్ వర్సెస్ షాదాబ్ ఖాన్
టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్న అతన్ని అడ్డుకోవడం పాక్ బౌలర్లకు కష్టమే. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ కనీసం ఫిప్టీ కొడుతున్న సూర్య పాక్‌తో మ్యాచ్‌కు కీలకం కానున్నాడు. ఒకవేళ టీమిండియా టాపార్డర్ తక్కువకే వెనుదిరుగుతే అప్పుడు ఇన్నింగ్స్ బాధ్యత మొత్తం సూర్యకుమార్‌దే. ఇప్పటికే ఈ ఏడాది టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సూర్యకుమార్ నెంబర్‌వన్‌గా ఉన్నాడు. ఇక షాదాబ్ ఖాన్ కూడా పాకిస్తాన్ తరపున మంచి బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన షాదాబ్ ఖాన్ 73 వికెట్ల తీసిన షాదాబ్ సూర్యకు పోటీ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజా మెరుపులు.. సూపర్-12కు జింబాబ్వే
Comments
Please login to add a commentAdd a comment