టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో టీమిండియా మరో విజయం ఖాతాలో వేసుకుంది. పాకిస్తాన్‌పై మధురమైన విజయం సాధించిన టీమిండియా అదే జోరును నెదర్లాండ్స్‌పై చూపించింది. కోహ్లికి తోడుగా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు హాఫ్ సెంచరీలతో మెరవడం.. ఆపై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో నెదర్లాండ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. ఇక మ్యాచ్‌లో 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న సూర్యకుమార్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సూర్యకుమార్.. కోహ్లితో చేసిన బ్రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ విజయం అనంతరం కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక స్ట్రాంగ్ విజయం(Another Strong Result) అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సూర్యకుమార్.. ''శూర్-వీర్ కలిపి'' అంటూ ట్యాగ్ చేశాడు. దీనర్థం ఏంటంటే.. కరణ్-అర్జున్ లాగా శూర్-వీర్(సూర్యకుమార్‌లో మొదటి రెండు.. కోహ్లిలో మొదటి రెండు అక్షరాలు కలిపి) టీమిండియాను గెలిపించారని. కాగా సూర్య ట్యాగ్‌కు స్పందించిన కోహ్లి..'' హహహ.. మాన్లా బహు(గుడ్ వన్ బ్రదర్)'' అంటూ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లు ఫిఫ్టీలతో కథం తొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లందరూ మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ భారీ తేడాతో ఓడింది.
భువీ 3 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్‌లు కూడా తలో 2 వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది. వరుసగా రెండు విజయాలతో గ్రూఫ్-2లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను ఆదివారం(అక్టోబర్ 30న) సౌతాఫ్రికాతో ఆడనుంది.
చదవండి: నెదర్లాండ్స్‌పై గెలుపు.. 'సంతోషంగా మాత్రం లేను'
బుమ్రా ప్రపంచ రికార్డు సమం చేసిన భువీ.. మరో అరుదైన రికార్డు కూడా..!
Comments
Please login to add a commentAdd a comment