సూర్యకుమార్ యాదవ్ (PC: BCCI)
ICC Mens T20 World Cup 2022 - India vs Netherlands- Surya Kumar Yadav: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లి(62- నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించి.. 25 బంతుల్లోనే అర్ధ శతకంతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.
సిడ్నీ వేదికగా నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చి 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఫ్యాన్స్‌కు కనువిందు చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో రిజ్వాన్ ఇప్పటి వరకు 825 పరుగులు చేశాడు.
ఇక నెదర్లాండ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్.. 867 పరుగులతో అతడిని అధిగమించాడు. టీ20లలో వరల్డ్ నెంబర్ 1గా రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి ఈ ముందుకు దూసుకువచ్చాడు. ఏడాది ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా గురువారం జింబాబ్వేతో పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో మొదటి స్థానం కోసం రిజ్వాన్.. ఈ ముంబై బ్యాటర్‌తో పోటీపడనున్నాడు.
కాగా ప్రపంచకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సూర్య 15 పరుగులకే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. ఇక ఇదే ఏడాది అతడు అంతర్జాతీయ టీ20లలో తొలి సెంచరీ నమోదు చేసిన విషయం విదితమే. ఇక సూపర్-12లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా టీమిండియా నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో గెలుపొందింది.
చదవండి: మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు! మ్యాచ్ గెలిచినా..
Ind Vs Ned: పాక్‌తో అయినా.. పసికూనతో అయినా నీ ఆట తీరు మారదా? అదేం కాదు!
T20 WC IND Vs NED: టీమిండియా అరుదైన ఘనత.. 2007 తర్వాత మళ్లీ ఇప్పుడే
Comments
Please login to add a commentAdd a comment