ICC Mens T20 World Cup 2022 - India vs Netherlands: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతడు పూర్తిగా నిరాశపరిచాడు. పసికూనతో సిడ్నీ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సిడ్నీ మ్యాచ్‌లో.. డచ్ బౌలర్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరులోనూ రాహుల్ వైఫల్యం(4 పరుగులు) చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విఫలం కావడంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. రాహుల్‌ను తప్పించి ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘‘కనీసం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనైనా రాణిస్తావు అనుకుంటే.. ఇలా చేశావేంటి?’’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
నెదర్లాండ్స్‌పై వరల్డ్ రికార్డంటూ..
‘‘ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. నెదర్లాండ్స్ అయినా ఇంత నిలకడగా విఫలమయ్యే ఆటగాడు మరొకరు ఉండరు. ఒక్కసారి పరుగులు తీయొద్దని ఫిక్స్ అయితే.. ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా రాహుల్ భయ్యా ఆట తీరు ఇలాగే ఉంటుంది మరి!’’ అని సెటైర్లు వేస్తున్నారు. ‘‘అలా ఓపెనింగ్ చేశాడో లేదో ఇలా ముగిసిపోయింది. నెదర్లాండ్స్‌పై రాహుల్ వరల్డ్ రికార్డు ఇదీ! అయినా మనోడు ఐపీఎల్‌లో బాగా ఆడతాడులే!’’ అంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.
అదేం కాదు!
కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రాహుల్ నెట్స్‌లో తీవ్ర సాధన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎల్బీడబ్ల్యూ విషయంలో రాహుల్‌కు అన్యాయం జరిగిందని.. రివ్యూకి వెళ్లి ఉంటే ఫలితం వేరేలా ఉండేందంటూ అతడి ఫ్యాన్స్ అంటున్నారు.
చదవండి: మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు! మ్యాచ్ గెలిచినా..
టీ20 వరల్డ్‌కప్‌ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment