219 పరుగులకే ఆసీస్ ఎలెవన్ ఆలౌట్
అడిలైడ్:టీమిండియాతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎలెవన్ 219 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్ షార్ట్ డకౌట్ గా వెనుదిరగగా, మరో ఓపెనర్ కార్టర్స్ (58) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం కేఆర్ స్మిత్ (40), నీల్సన్ (43) పరుగులు చేశారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో 71.5 ఓవర్లలో ఆసీస్ ఎలెవన్ 219 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో ఆరూన్ కు మూడు వికెట్లు దక్కగా, మహ్మద్ సమీ, భువనేశ్వర్ కుమార్, కరణ్ శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి.