
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ ఓపెనింగ్ జోడీ రోహిత్–ధావన్. కానీ, కొంతకాలంగా ఇద్దరి భాగస్వామ్యంలో పరుగులు రావడం లేదు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ (శిఖర్ 2, 1, రోహిత్ 2, 19) విఫలమయ్యారు. వ్యక్తిగతంగా ధావన్ ఫర్వాలేకున్నా, ఐపీఎల్ సహా రోహిత్ ఫామ్ పేలవంగా ఉంది. కీలక మ్యాచ్‌ల్లో వీరి రాణింపుపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఐసీసీ టోర్నీల్లో ధావన్ నిలకడగా ఆడతాడు. రోహిత్ ఊపులోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. వీరిద్దరూ ఇక్కడే జరిగిన గత రెండు చాంపియన్స్ ట్రోఫీల్లో దుమ్మురేపిన నేపథ్యంలో తిరిగి లయ అందుకుంటారని ఆశించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment