బంతి తగిలి సిల్వకు గాయం | Sri Lanka's Test batsman Kaushal Silva hit on head with a ball out ... | Sakshi
Sakshi News home page

బంతి తగిలి సిల్వకు గాయం

Published Tue, Apr 26 2016 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

బంతి తగిలి సిల్వకు గాయం

బంతి తగిలి సిల్వకు గాయం

కొలంబో: శ్రీలంక టెస్టు క్రికెటర్ కౌశల్ సిల్వ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నాహాల్లో భాగంగా పల్లెకెలెలో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కౌశల్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, చండీమల్ కొట్టిన షాట్ బలంగా అతని మెడ కింది భాగంలో తగిలింది.

ఆ సమయంలో సిల్వ హెల్మెట్ పెట్టుకొనే ఉన్నాడు. కొద్దిసేపు అతను స్పృహ కోల్పోయినట్లు కనిపించాడు. దాంతో హుటాహుటిన సమీపంలో కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ జరిపారు. అనంతరం వెంటనే విమానంలో కొలంబోకు తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని, పరిస్థితి నిలకడగా ఉందని లంక బోర్డు ప్రకటించింది. లంక తరఫున కౌశల్ 24  టెస్టులు ఆడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement