Kaushal Silva
-
శ్రీలంక 137/1
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు శుక్రవారం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. కౌశల్ సిల్వ (64 బ్యాటింగ్), కరుణరత్నే (50) తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించారు. సిల్వతో పాటు కుషాల్ మెండిస్ (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు 279/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (167 నాటౌట్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెరాత్‌కు 4 వికెట్లు దక్కాయి. -
బంతి తగిలి సిల్వకు గాయం
కొలంబో: శ్రీలంక టెస్టు క్రికెటర్ కౌశల్ సిల్వ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నాహాల్లో భాగంగా పల్లెకెలెలో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కౌశల్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, చండీమల్ కొట్టిన షాట్ బలంగా అతని మెడ కింది భాగంలో తగిలింది. ఆ సమయంలో సిల్వ హెల్మెట్ పెట్టుకొనే ఉన్నాడు. కొద్దిసేపు అతను స్పృహ కోల్పోయినట్లు కనిపించాడు. దాంతో హుటాహుటిన సమీపంలో కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ జరిపారు. అనంతరం వెంటనే విమానంలో కొలంబోకు తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని, పరిస్థితి నిలకడగా ఉందని లంక బోర్డు ప్రకటించింది. లంక తరఫున కౌశల్ 24 టెస్టులు ఆడాడు. -
బంతి తగిలి.. కుప్పకూలిన క్రికెటర్
మరో యువ క్రికెటర్ మైదానంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రి పాలయ్యాడు. శ్రీలంక టెస్టు జట్టులోని ఓ పెనర్ కౌశల్ సిల్వ ఓ స్వదేశీ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్లు తీయించారు. అవన్నీ బాగానే ఉన్నాయి గానీ, తదుపరి పరీక్షల కోసం అతడిని రాజధాని కొలంబోకు తరలించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. సిల్వ ఇప్పటివరకు శ్రీలంక జట్టు తరఫున 24 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 1,404 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 31. షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా సిల్వకు బాల్ తగిలిందని టీమ్ మేనేజర్ సేనానాయకే తెలిపారు. శ్రీలంక జట్టు వైస్ కెప్టెన్ దినేష్ చండీమల్ వెంటనే కౌశల్ తల వెనకవైపునకు పరుగెత్తి, దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించినా, అప్పటికే బాల్ తగిలింది. గతంలో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ ఇలాగే బాల్ తలకు తగలడంతో 2014 నవంబర్‌లో మరణించాడు. ఆ తర్వాతి నుంచి ఆటగాళ్ల భద్రత కోసం అదనపు ప్యాడింగ్తో కూడిన హెల్మెట్లను ఉపయోగిస్తున్నారు. బాల్ తగిలే సమయానికి సిల్వ అలాంటి హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో శ్రీలంక జట్టు పర్యటన ఉండటంతో దానికి సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లోనే సిల్వ గాయపడ్డాడు. -
కౌశాల్ సిల్వ సెంచరీ
గాలే: పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక 300 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కౌశాల్ సిల్వ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 300 బంతుల్లో 16 ఫోర్లతో 125 పరుగులు చేశాడు. సంగక్కర (106 బంతుల్లో 50; 2 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 112 పరుగులు జోడించించారు. సిల్వ, సంగ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో వహాబ్ రియాజ్, జుల్ఫికర్ బాబర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. యాసిర్ షా, హఫీజ్ రెండేసి వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ 11 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. హఫీజ్(2), షెహజాద్(9) అవుటయ్యారు. -
పట్టు బిగించిన పాక్
అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు క్రమంగా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కౌశల్ సిల్వ (177 బంతుల్లో 81; 11 ఫోర్లు), సంగక్కర (99 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రీజులో చండిమాల్ (36 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉన్నాడు. జునైద్ ఖాన్, బిలావల్ భట్టికి రెండేసి వికెట్లు దక్కాయి. ప్రస్తుతం లంక ఏడు పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో శుక్రవారం వీలైనంత త్వరగా మిగిలిన లంక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చితే లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్‌కు తగినంత సమయం ఉంటుంది. అంతకుముందు 327/4 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ 129.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 179 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ త్వరగానే పెవిలియన్‌కు చేరడంతో 56 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మిస్బా 135 (306 బంతుల్లో; 16 ఫోర్లు; 1 సిక్స్) పరుగులు చేశాడు. ఎరంగ, హెరాత్‌లకు మూడేసి, లక్మల్‌కు రెండు వికెట్లు దక్కాయి.