
కౌశాల్ సిల్వ సెంచరీ
గాలే: పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక 300 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కౌశాల్ సిల్వ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 300 బంతుల్లో 16 ఫోర్లతో 125 పరుగులు చేశాడు. సంగక్కర (106 బంతుల్లో 50; 2 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 112 పరుగులు జోడించించారు. సిల్వ, సంగ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.
పాకిస్థాన్ బౌలర్లలో వహాబ్ రియాజ్, జుల్ఫికర్ బాబర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. యాసిర్ షా, హఫీజ్ రెండేసి వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ 11 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. హఫీజ్(2), షెహజాద్(9) అవుటయ్యారు.