బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు.. నీకు చెక్‌పెడతాం కదా! | T20 World Cup 2021: Coach Ravi Shastri India Palyers Watch Babar Azam Batting | Sakshi
Sakshi News home page

T20 WC IND vs PAK: బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు.. నీకు చెక్‌పెడతాం కదా!

Published Tue, Oct 19 2021 12:19 PM | Last Updated on Wed, Oct 20 2021 2:54 PM

T20 World Cup 2021: Coach Ravi Shastri India Palyers Watch Babar Azam Batting - Sakshi

Courtesy: BCCI

T20 World Cup 2021 IND vs PAK.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్‌ మధ్య అక్టోబర్‌ 24న జరగనున్న మ్యాచ్‌ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్‌ జరగనుండడంతో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఎక్కడ చూసిన అభిమానులు ఈ మ్యాచ్‌పై చర్చలు జరుపుతున్నారు. ఈసారి మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ సోమవారం వెస్టిండీస్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే.

చదవండి: T20 World Cup: ఇండియా- పాక్‌ మ్యాచ్‌ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే!

అయితే టీమిండియా- ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌- విండీస్‌ మ్యాచ్‌ జరగడంతో  టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి సహా భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌ చూస్తూ కనిపించడం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విండీస్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బాబర్‌ అజమ్‌ క్లాస్‌  హాఫ్‌సెంచరీతో మెరిశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. పైగా బాబర్‌ అజమ్‌ ప్రస్త్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా బాబర్‌ అజమ్‌ అత్యధ్బుతమైన ఫామ్‌లో ఉండడంతో టీమిండియాతో మ్యాచ్‌లో కీలకంగా మారాడు. అతని క్లాస్‌ బ్యాటింగ్‌ను రవిశాస్త్రి సహా మిగతా ఆటగాళ్లు రెప్పవాల్చకుండా చూశారు.

అయితే అక్టోబర్‌ 24న టీమిండియా-పాకిస్తాన్‌ మధ్య ఫైట్‌లో భాగంగా బాబర్‌ అజమ్‌ను ఎలా కంట్రోల్‌ చేయాలనేదానిపై రవిశాస్త్రి భువీ, శార్దూల్‌, దీపక్‌ చహర్‌లకు వివరించినట్లు కొందరు అభిమానులు పేర్కొన్నారు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజయం సాధించగా.. ఇటు ఇంగ్లండ్‌పై వార్మప్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ అర్థ శతకాలతో మెరవడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా టీమిండియా రేపు(అక్టోబర్‌ 20న) ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.    

చదవండి: T20 World Cup: సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి.. కోహ్లి, ధోని ఫొటో వైరల్‌!           

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement