లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి అర్ధసెంచరీ సాధించాడు. మూడో రోజు ఆటలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి.. 98 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో అబ్దైన్ సఖండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా షాట్లు ఆడిన కోహ్లి సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. అయితే వారికి మరోసారి నిరాశే ఎదురైంది.
90/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (43), హనుమ విహారి (20), శార్దూల్ ఠాకూర్ (28), పుజారా (22) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (46), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 246/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం
Comments
Please login to add a commentAdd a comment