కొలంబొ: శ్రీలంకతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ కనబరుస్తున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్‌లు గురువారం ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ సందర్భంగా తమ బౌలింగ్‌తో మెరిశారు. నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్‌ల వికెట్లను చహల్ తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసింది.
కాగా చహల్, కుల్దీప్‌తో పాటు నవదీప్ సైనీ, దీపక్ చహర్, చేతన్ సకారియాలు కూడా వికెట్లతో మెరిశారు. సైనీ ఖాతాలో దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యాలు వికెట్లు ఉండగా.. ప్రస్తుత కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్‌ను చేతన్ సకారియా దక్కించుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో కుల్దీప్ యాదవ్ ఘోరంగా విఫలమవడం విమర్శలకు దారి తీసింది. చహల్ కూడా అంతంత ప్రదర్శన మాత్రమే నమోదు చేయడంతో లంకతో సిరీస్ వీరిద్దరికి కీలకం కానుంది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌ల సారధ్యంలో రెండు జట్లుగా విడిపోయిన టీమిండియా ఇంట్రాస్కా‍్వడ్ మ్యాచ్‌లను ముగించుకొని జూలై 13న లంకతో తొలి వన్డే ఆడేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment