ఓపెనర్లను అవుట్‌ చేసిన కుల్దీప్‌ | england eleven 129/3 in 22 overs | Sakshi
Sakshi News home page

ఓపెనర్లను అవుట్‌ చేసిన కుల్దీప్‌

Published Tue, Jan 10 2017 7:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

england eleven 129/3 in 22 overs

ముంబై: భారత్‌ ఏతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ లెవెన్‌ ఓపెనర్లు జేసన్ రాయ్‌ (62), అలెక్స్‌ హేల్స్‌ (40) జట్టుకు శుభారంభం అందించారు. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భారత బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో హేల్స్‌, రాయ్‌ ఇద్దరూ క్యాచవుటయ్యారు. కాసేపటికే చహల్‌ బౌలింగ్‌లో ఇయాన్‌ మోర్గాన్‌ అవుటయ్యాడు. 305 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్‌ టీమ్ 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు  97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు.  శిఖర్ ధవన్ (63), యువరాజ్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement