england eleven
-
ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం
England Batsman Dan Lincoln Stormy Century Of 31 Balls: డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఎలెవెన్, ఇటలీ జట్ల మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఇంగ్లీష్ ఆటగాడు డ్యాన్ లింకన్ 31 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో మెరుపు శతకం(105 నాటౌట్) సాధించాడు. 26 ఏళ్ల లింకన్ 338.70 స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని విధ్వంసం ధాటికి ప్రత్యర్ధి నిర్ధేశించిన 142 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. వివరాల్లోకి వెళితే.. యూరోపియన్ ఛాంపియన్షిప్ గ్రూప్ సి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఇటలీ కెప్టెన్ బల్జిత్ సింగ్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ డ్యాన్ లింకన్ ప్రత్యర్ధి బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీని నమోదు చేసింది. లింకన్ బుల్లెట్ ఇన్నింగ్స్‌లో 98 పరుగులు సిక్సర్లు, బౌండరీల రూపంలో రావడం విశేషం. చదవండి: వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..! -
కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్‌లో.. ప్చ్..!
ముంబై: మహేంద్రసింగ్ ధోనీ సారథిగా వ్యవహరించిన చివరి మ్యాచ్‌లో సీనియర్ జట్టు పోరాడి ఓడింది. ఇంగ్లండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 304 పరుగులు చేసింది. కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడిన ధోనీ మునుపటి ఆటతీరును గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ఏ జట్టు 304 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎలెవన్‌కు విసిరింది. కెప్టెన్ జేజే రాయ్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ కూడా ధాటిగా ఆడింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్లలో బిల్లింగ్ అద్భుతంగా రాణించి 93 పరుగులు చేయగా, జేజే రాయ్ 62 పరుగులు సాధించాడు. ఓపెనర్ హేల్స్ 40 పరుగులు, బట్లర్ 46 పరుగులు, డాసన్ 41 పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అంతకుముందు రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. -
ఓపెనర్లను అవుట్ చేసిన కుల్దీప్
ముంబై: భారత్ ఏతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెవెన్ ఓపెనర్లు జేసన్ రాయ్ (62), అలెక్స్ హేల్స్ (40) జట్టుకు శుభారంభం అందించారు. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో హేల్స్, రాయ్ ఇద్దరూ క్యాచవుటయ్యారు. కాసేపటికే చహల్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు. 305 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ టీమ్ 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. -
మునుపటిలా రెచ్చిపోయిన ధోనీ
సెంచరీ చేసిన అంబటి రాయుడు యువీ, ధవన్ హాఫ్ సెంచరీలు ఇంగ్లండ్ లెవెన్‌తో భారత్ ఏ ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: ఇటీవల స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇరగదీశాడు. ఇంగ్లండ్ లెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ఏ జట్టు భారీ స్కోరు సాధించింది. ముంబైలో మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు.