టాస్‌ వేయమంటే.. బౌలింగ్‌ చేశావేంట్రా నాయన! | Khawaja's Unique Coin Toss Leaves Opposition Captain In Splits | Sakshi
Sakshi News home page

టాస్‌ వేయమంటే.. బౌలింగ్‌ చేశావేంట్రా నాయన!

Published Tue, Nov 26 2019 2:51 PM | Last Updated on Tue, Nov 26 2019 3:25 PM

Khawaja's Unique Coin Toss Leaves Opposition Captain In Splits - Sakshi

బ్రిస్బేన్‌:  ఆస్ట్రేలియా దేశవాళీలో భాగమైన మార్ష్‌ కప్‌ వన్డే టోర్నీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా-క్వీన్స్‌లాండ్‌ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరిగింది. ఈ పోరులో ఆస్ట్రన్‌ టర్నర్‌ నేతృత్వంలోని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా గెలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉస్మాన్‌ ఖవాజా సారథ్యంలో క్వీన్స్‌లాండ్‌ 49.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్‌ కాగా, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షాన్‌ మార్ష్‌(101; 132  బంతుల్లో 13 ఫోర్లు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు టాస్‌ వేసే క‍్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు అయిన ఉస్మాన్‌ ఖవాజా-టర్నర్‌లు మైదానంలోకి వచ్చారు. అయితే కాయిన్‌ను ఖవాజా అందుకుని టాస్‌ వేయడానికి సిద్ధమైన క్రమంలో నవ్వులు పూయించాడు. టాస్‌ను ఒక ఎండ్‌లో వేస్తే అది దాదాపు మరొక ఎండ్‌లో పడింది. టాస్‌ కాయిన్‌ అందుకున్న ఖవాజా..  టాస్‌ వేయమని మ్యాచ్‌ రిఫరీ ఓకే చెప్పగానే కాస్త ముందుకు దూకుతూ వెళ్లాడు. ఆ కాయిన్‌ను పైకి గట్టిగా విసరగా అది చాలా దూరంగా పడింది.  దాదాపు 10 మీటర్ల దూరంగా వెళ్లింది. రిఫరీ నవ్వుకుంటూ కాయిన్‌ పడిన చోటకు వెళ్లి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా టాస్‌ గెలిచిందని చెప్పాడు.(ఇక్కడ చదవండి: ‘వార్న్‌.. నా రికార్డులు చూసి మాట్లాడు’)

ఇక్కడ ఖవాజా ట్రిక్‌ను ప్రదర్శించినా టాస్‌ గెలవలేకపోయాడు. సాధారణంగా టాస్‌ వేస్తే కాయిన్‌ ఇంచుమించు కెప్టెన్లు నిలబడి ఉన్న చోటనే పడుతుంది. ఖవాజా టాస్‌ వేసిన తీరును వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో ఖవాజాపై సెటైర్లు పేలుతున్నాయి. టాస్‌ వేయమంటే.. బౌలింగ్‌ చేసేవేంట్రా నాయన అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అది కాయిన్‌ అనే సంగతి మరచిపోయి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయాలనుకున్నావా అని కామెంట్లు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోవడంతో ఆసీస్‌ జట్టులో ఖవాజా చోటు కోల్పోయాడు. ఆ క‍్రమంలోనే పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ఖవాజాను ఎంపిక చేయలేదు. దాంతో దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ ఫామ్‌లోకి రావడానికి యత్నిస్తున్నాడు. మార్ష్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఖవాజా 26 పరుగులే చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement