క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ లారీ సాల్(96) మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో పెర్త్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాల్ మరణించినట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 1982 నుంచి 1995 వరకు ఆస్ట్రేలియా జట్టుకు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశారు.
అతని పని చేసిన కాలంలోనే స్టీవ్ వా,మార్క్ వా, మార్క్ టేలర్, ఇయాన్ హీలీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, డామియన్ మార్టిన్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ వంటి ఆసీసీ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సాల్ 1701 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో ఒక ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 7వ ఆస్ట్రేలియన్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో పనిచేసినందున లారీ సాల్‌కు 'కల్నల్' అనే మారుపేరు కూడా ఉంది.
చదవండి: TNPL: మురళీ విజయ్‌కు చేదు అనుభవం.. డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..!
Comments
Please login to add a commentAdd a comment