టి20 ప్రపంచకప్ 2022కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇవాళ(గురువారం) వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది.
తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి కల్పించారు. అయితే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లి రెండో మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. కేఎల్ రాహుల్ మాత్రం రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇక రాహుల్ రాకతో తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్ ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం.
ఇక తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ ఈసారి బ్యాట్‌కు పదును చెప్పాలని భావిస్తున్నాడు. దీపక్ హుడా, హార్దిక్ పాండ్యాలు, దినేశ్ కార్తిక్‌లు మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఇక బౌలర్లుగా అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, అశ్విన్‌లు తుదిజట్టులో ఉన్నారు. మరోవైపు వెస్ట్రన్ ఆస్ట్రేలియా మాత్రం ఎలాంటి మార్పులేకుండానే బరిలోకి దిగుతుంది.
ఇండియా ఎలెవన్: రోహిత్, రాహుల్ (కెప్టెన్), హుడా, పంత్, హార్దిక్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా: ఏజే టై, జె.ఫిలిప్, హెచ్. మెకెంజీ, ఎస్‌టీ ఫానింగ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, ఆస్టన్ టర్నర్, డీఆర్సీ షార్ట్, ఎన్ హాబ్సన్, ఎమ్ కెల్లీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డీ మూడీ, ఎల్‌ఆర్ మోరిస్
#TeamIndia will bowl first.
— BCCI (@BCCI) October 13, 2022
A look at our Playing XI for the second practice match against Western Australia. pic.twitter.com/5Wutj8rFYI
చదవండి: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు
Comments
Please login to add a commentAdd a comment