ఆరవ తరగతి చదువుతున్న చిన్నారి ఒంటరితనాన్ని అధిగమించేందుకు పెంపుడు జంతువును దత్తత తీసుకోలేని వారికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ పెట్‌ను ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచింది. ప్రతి ఏడాది 6 లక్షల పెంపుడు జంతువులను దేశ వ్యాప్తంగా దత్తత తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఆర్థిక స్థోమత ఉంది. కానీ పెంపుడు జంతువును దత్తత తీసుకుని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది అందరికీ అది సాధ్యపడక పోవచ్చు. అలాంటి వారికి 12 ఏళ్ల చిన్నారి విద్యార్థి నేత్ర సింగ్ అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ పెట్ చక్కగా ఉపకరిస్తుంది.
ఈ మేరకు బోవెన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న నేత్ర సింగ్ పెంపుడు జంతువులకు ప్రత్యామ్నాయంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి మరీ ఈ రోబోటిక్ పెట్‌ని అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, సహచరులతో సహా వెయ్యి మందితో కూడిన టెడ్ సమావేశంలో ప్రదర్శించడమే దీని ఉపయోగాలు గురించి మాట్లాడింది నేత్ర. రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని నయం చేయడంలో సహాయపడటమేగాక మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పింది. ఆ సమావేశంలో నేత్ర మాట్లాడుతూ..ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువుల దత్తత పెరిగింది. అదీగాక పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది.
ఈ పెంపుడు జంతువులు డెలివరీ బాయ్‌లను భయపెట్టడంతో చనిపోయిన ఘటనలను కూడా చేశాం. ఇంకోవైపు వీధికుక్కలు పసిపిల్లలపై దాడి చేసి చంపిన ఘటనలను కూడా రోజుకి ఒకటి వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నేత్ర సింగ్ చెబుతున్న రోబోటిక్ పెట్ ఆలోచనను అందర్నీ ప్రేరేపించింది. తన పాఠశాల నిర్వహించిన బోవెన్‌పల్లిలోని దాని ప్రాంగణంలో 'స్టార్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్--యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో టెడ్(TED)లాంటి చర్చలో భాగంగా నేత్ర తన ఆలోచన పంచుకుంది. ఈ ఆలోచనకు గానూ ఆమెకు అందరి నుంచి ప్రశంసలు అందాయి.
"నేను ఇప్పటికీ దానిపై పని చేస్తున్నాను. ప్రస్తుతానికి, ఇది నా ఆలోచన. నేను దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి ప్రొఫెషనల్ మెంటరింగ్‌ని కోరుకుంటున్నానని ధీమాగా చెప్పుకొచ్చింది" విద్యార్థి నేత్ర. ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ నేత్ర ఆలోచనలు తోపాటు పాఠశాలలోని మరో 50 మంది విద్యార్థుల ఆలోచనల విన సంతోషం వ్యక్తం చేశారు. ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రోబోటిక్ పెట్ అనేది ఒక వినూత్న ఆలోచన అని డాక్టర్ కె. సువర్ణ చెప్పారు.
ఈ చర్చలో 50కిపైగా విద్యార్థులు తమ కొత్త ఆలోచనలు, దృక్కోణాలను పంచుకున్నారు. విద్యార్థులు మెరుగైన పనితీరు రెండు నిమిషాల నిడివి గల సందేశాలు, రీల్స్, షార్ట్‌లు, వాట్సాప్ స్టేటస్ వీడియోల రూపంలో కనబర్చేలా టెడ్ (TED) లాంటి షార్ట్ టాక్‌లతో ముందుకు వచ్చింది సెయింట్ పీటర్స్ హైస్కూల్. పాఠశాలకు చెందిన వరేణ్య, ప్రీతమ్, శామ్యూల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఫైర్ అండ్ గ్యాస్ లీకేజ్ ఫిక్టర్ రోబోట్‌ను సమర్పించాయి. ఇది CBSE రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఎంపికైంది.
జనవరి 2024లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రదర్శనలో పాల్గొంటుంది. నమోదు చేసుకున్న 3169 విద్యార్థి జట్లలో ఎంపిక చేసిన 30 ప్రదర్శనలలో సెయింట్ పీటర్స్ జట్టు ఒకటి. టెడ్ (TED) లాంటి చర్చలు పంచుకోవడానికి విలువైన ఆలోచనల కోసం పాఠశాల స్థాయి వేదిక. ఇది కూడా కేవలం ఎలివేటర్ ప్రయాణ సమయంలో ఐడియాను పంచుకుని, ప్రభావితం చేయగలిగే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం. 1979లో ప్రారంభమైన ఈ పాఠశాల 24 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో లోగొను ఆవిష్కరించి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోనుంది.
(చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!)
Comments
Please login to add a commentAdd a comment