Ted
-
రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి!
ఆరవ తరగతి చదువుతున్న చిన్నారి ఒంటరితనాన్ని అధిగమించేందుకు పెంపుడు జంతువును దత్తత తీసుకోలేని వారికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ పెట్‌ను ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచింది. ప్రతి ఏడాది 6 లక్షల పెంపుడు జంతువులను దేశ వ్యాప్తంగా దత్తత తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఆర్థిక స్థోమత ఉంది. కానీ పెంపుడు జంతువును దత్తత తీసుకుని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది అందరికీ అది సాధ్యపడక పోవచ్చు. అలాంటి వారికి 12 ఏళ్ల చిన్నారి విద్యార్థి నేత్ర సింగ్ అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ పెట్ చక్కగా ఉపకరిస్తుంది. ఈ మేరకు బోవెన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నేత్ర సింగ్ పెంపుడు జంతువులకు ప్రత్యామ్నాయంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి మరీ ఈ రోబోటిక్ పెట్ని అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, సహచరులతో సహా వెయ్యి మందితో కూడిన టెడ్ సమావేశంలో ప్రదర్శించడమే దీని ఉపయోగాలు గురించి మాట్లాడింది నేత్ర. రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని నయం చేయడంలో సహాయపడటమేగాక మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పింది. ఆ సమావేశంలో నేత్ర మాట్లాడుతూ..ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువుల దత్తత పెరిగింది. అదీగాక పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. ఈ పెంపుడు జంతువులు డెలివరీ బాయ్‌లను భయపెట్టడంతో చనిపోయిన ఘటనలను కూడా చేశాం. ఇంకోవైపు వీధికుక్కలు పసిపిల్లలపై దాడి చేసి చంపిన ఘటనలను కూడా రోజుకి ఒకటి వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నేత్ర సింగ్ చెబుతున్న రోబోటిక్ పెట్ ఆలోచనను అందర్నీ ప్రేరేపించింది. తన పాఠశాల నిర్వహించిన బోవెన్పల్లిలోని దాని ప్రాంగణంలో 'స్టార్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్--యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో టెడ్(TED)లాంటి చర్చలో భాగంగా నేత్ర తన ఆలోచన పంచుకుంది. ఈ ఆలోచనకు గానూ ఆమెకు అందరి నుంచి ప్రశంసలు అందాయి. "నేను ఇప్పటికీ దానిపై పని చేస్తున్నాను. ప్రస్తుతానికి, ఇది నా ఆలోచన. నేను దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి ప్రొఫెషనల్ మెంటరింగ్ని కోరుకుంటున్నానని ధీమాగా చెప్పుకొచ్చింది" విద్యార్థి నేత్ర. ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ నేత్ర ఆలోచనలు తోపాటు పాఠశాలలోని మరో 50 మంది విద్యార్థుల ఆలోచనల విన సంతోషం వ్యక్తం చేశారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రోబోటిక్ పెట్ అనేది ఒక వినూత్న ఆలోచన అని డాక్టర్ కె. సువర్ణ చెప్పారు. ఈ చర్చలో 50కిపైగా విద్యార్థులు తమ కొత్త ఆలోచనలు, దృక్కోణాలను పంచుకున్నారు. విద్యార్థులు మెరుగైన పనితీరు రెండు నిమిషాల నిడివి గల సందేశాలు, రీల్స్, షార్ట్‌లు, వాట్సాప్ స్టేటస్ వీడియోల రూపంలో కనబర్చేలా టెడ్ (TED) లాంటి షార్ట్ టాక్లతో ముందుకు వచ్చింది సెయింట్ పీటర్స్ హైస్కూల్. పాఠశాలకు చెందిన వరేణ్య, ప్రీతమ్, శామ్యూల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఫైర్ అండ్ గ్యాస్ లీకేజ్ ఫిక్టర్ రోబోట్‌ను సమర్పించాయి. ఇది CBSE రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఎంపికైంది. జనవరి 2024లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రదర్శనలో పాల్గొంటుంది. నమోదు చేసుకున్న 3169 విద్యార్థి జట్లలో ఎంపిక చేసిన 30 ప్రదర్శనలలో సెయింట్ పీటర్స్ జట్టు ఒకటి. టెడ్ (TED) లాంటి చర్చలు పంచుకోవడానికి విలువైన ఆలోచనల కోసం పాఠశాల స్థాయి వేదిక. ఇది కూడా కేవలం ఎలివేటర్ ప్రయాణ సమయంలో ఐడియాను పంచుకుని, ప్రభావితం చేయగలిగే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం. 1979లో ప్రారంభమైన ఈ పాఠశాల 24 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో లోగొను ఆవిష్కరించి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోనుంది. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ 'ఫాంటసీ' మూవీస్ ఇవే..
Best Fantasy Movies On Amazon Prime Video May 2022: 'సినిమా.. సినిమా.. సినిమా.. ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవైడ్.. బట్ ! సినిమా లైక్స్ మీ.. ఐ కాంట్ అవైడ్' అంటారు మూవీ లవర్స్. ఈ సినీ ప్రియులకి జోనర్స్‌తో పనిలేదు. వైవిధ్యంగా ఎలాంటి జోనర్లో మూవీస్ వచ్చిన బ్రేక్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, హార్రర్, యాక్షన్, ఫాంటసీ, స్కైఫై వంటి తదితర జోనర్లలో సినిమాలు కాస్త డిఫరెంట్‌గా ఉండి ఎంటర్టైన్ చేస్తే చాలు హిట్ ఇచ్చి ఎక్కడికో తీసుకుపోతారు. ఇక మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా వచ్చాయి ఓటీటీలు. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వెబ్ సిరీస్, మూవీస్లను రూపొందిస్తూ తమ సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. డిఫరెంట్ జోనర్స్‌తో వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. అలాగే వాస్తవికతకు దూరంగా ఉండి ఊహలోకపు అంచుల్లో విహరించేలా చేస్తాయి ఫాంటసీ జోనర్ సినిమాలు. మరీ ఈ అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకునే ఆ ఫాంటసీ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దామా ! 1. అక్వామాన్ 2. ది లెజెండ్ ఆఫ్ టార్జాన్ 3. కాంగ్: ది స్కల్ ఐలాండ్ 4. స్నో వైట్ అండ్ ది హంట్స్మాన్ 5. టెడ్ 6. మూన్‌షాట్ 7. సిండ్రెల్లా 8. ది కోబ్లార్ -
క్లబ్‌హౌజ్‌లో ఎంట్రీ ఇప్పుడు మరింత ఈజీ..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్ క్లబ్‌హౌజ్. ఈ యాప్‌తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. క్లబ్‌హౌజ్ యాప్‌ను మార్చి 2020లో విడుదల చేశారు. క్లబ్‌హౌజ్‌కు భారీగా ప్రాచుర్యం రావడంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ కూడా ఆడియో రూపంలో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్‌హౌజ్‌లో చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు, లేదా ఇతరులు ఆహ్వానిస్తేనే తప్ప అందులో చేరే అవకాశం లేదు. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో చూపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం కొత్త యూజర్లకు క్లబ్‌హౌజ్ అందుబాటులో వస్తోంది. తాజాగా క్లబ్‌హౌజ్ అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఇన్విటేషన్ కోడ్ లేకుండా యూజర్లు ఇకపై క్లబ్‌హౌజ్‌లో జాయిన్ కావచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. వెయిటింగ్ లీస్ట్ పద్దతిని కూడా ఎత్తి వేసింది. క్లబ్‌హౌజ్ లాంటి సర్వీసులను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, రెడ్డిట్, టెలిగ్రాం వంటివి తమ సొంత వర్షన్లతో యాప్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి. క్లబ్‌హౌజ్ ప్రకారం.. ప్రస్తుతం క్లబ్‌హౌజ్‌లో డేలీ రూమ్స్ సంఖ్య 50 వేల నుంచి 5 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా క్లబ్ హౌజ్ టెడ్ టాక్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. -
ఈ పదేళ్ల పాపపై ప్రపంచ దృష్టి
పుణె: పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారిపై తల్లిదండ్రుల ప్రభావమే అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏం కలలు కంటుంటారో, ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటారో సహజంగా అదే వారి మనసులో నాటుకుపోయి ఆ ప్రభావం వారిపై చెరిపేయలేని స్థాయిలో ఉండిపోతుంది. అది ఎంతమేరకు ప్రభావం ఉంటుందో, అలాంటి ప్రభావం వారిపై ఏ విధమైన ఒత్తిడి కలగజేస్తుందో.. అసలు వారికి ఏం కావాలో అనే విషయాన్ని పుణెకు చెందిన ఇషితా కాత్యాల్ అనే బాలిక అనర్గలంగా చెప్పింది. సాధారణంగా పెద్దపెద్దవాళ్లే వేదికపైకి ఎక్కి మాట్లాడేందుకు తటపటాయించే ఈ రోజుల్లో ఈ గడుగ్గాయి అతిరథమహారథులు పంచుకున్న వేదికపైకి ఎక్కి వారికి గుక్క తిప్పుకోలేని ప్రశ్నలు వేసింది. పిల్లల తరుపున తనొక్కతే ఒకల్తా పుచ్చుకొని వారి భావాలను బయటపెట్టింది. పుణెలో చదువుతున్న ఇషితా కాత్యాల్ అనే పదేళ్ల బాలిక ఈ ఏడాది కెనడాలో నిర్వహించిన టెక్నాలజీ, ఎంటర్ టైన్మెంట్, డిజైన్ (టీఈడీ) కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగాన్ని చేసింది. ఆమె అలా చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ మేథావులు, వ్యాపార వేత్తలు, గొప్పగొప్ప తత్వవేత్తలు ఉన్నారు. వీరంతా ఇషితా ప్రసంగం చేస్తున్న సమయంలో కిక్కురుమనకుండా కూర్చుండిపోయారు. ఆమె ప్రశ్నలు అడిగే తీరు సమాధానాలు చెబుతున్న తీరు మేథావులను కూడా ఆలోచనలో పడేసింది. 'పిల్లలు పెరిగే క్రమంలో అసలు వారు ఏంకావాలని కోరుకుంటారో మీకు తెలుసా.. మీరు కచ్చితంగా వారిని అలా అడగాలి కానీ ఎప్పుడైనా అడిగారా' అంటూ ఇషితా నిలదీసింది. 'మా కలలు తీసి పారేయకండి. మేం ఈ సమయంలో చాలా చేయగలం. మన ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే చాలా శక్తులు పిల్లల కలలకు వ్యతిరేకంగానే పనిచేస్తూనే ఉన్నాయి. మాకంటూ ఓ ప్రత్యేక భవిష్యత్ ఉంది. నా కల ఏమిటంటే.. పాఠశాల స్కూల్ ఫీజులు పెంచేముందు పదిసార్లు ఆలోచించాలి. మరో దేశంపైకి యుద్ధానికి పోయేముందు వందసార్లు ఆలోచించాలి. నీరు, ఆహారం వృధా చేసేముందు వెయ్యిసార్లు ఆలోచించాలి. అలాగే, తమ చిన్నారులు, వారి బాల్య జీవితం సాగుతున్న క్రమంలో వారి తల్లిదండ్రులు పదివేలసార్లు ఆలోచించాలి. ఇలా చేస్తే బాగుంటుందనేది నా కల' అని చెప్పింది. -
రాక్షసుడు
నిజాలు దేవుడికెరుక అమెరికాలోని యుటా, 1975. రాత్రి పన్నెండున్నర కావస్తోంది. సబార్డినేట్లతో కలిసి రోడ్లమీద పెట్రోలింగ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఆర్నాల్డ్. చలికాలం సమీపిస్తుం డటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అయితే అప్పుడప్పుడూ వచ్చి తాకుతోన్న చలిగాలులు ఎముకల్ని కొరకాలని ప్రయత్నించడమే కాస్త ఇబ్బంది పెడుతోంది. ‘‘ఇప్పుడే ఇంత చలిగా ఉంది... ఇంకొన్ని రోజులు పోతే ఏంటి మన పరిస్థితి?’’ అన్నాడు ఆర్నాల్డ్ స్వెటర్‌ని సరి చేసుకుంటూ. ‘‘నిజమే సర్, చలి కొరికేస్తోంది’’ వంతపాడాడు సబార్డినేట్లలో ఒక వ్యక్తి. ‘‘ఏమైనా ఈ మధ్య కాస్త క్రైమ్ రేట్ తగ్గినట్టే ఉంది కద సర్’’... పరిసరాలను పరిశీలిస్తూ అన్నాడు మరొకతను. అలా అన్నాడో లేదో... కారుకి సడెన్ బ్రేకు పడింది. అందరూ అదిరిపడ్డారు. ‘‘ఏంటి డ్యానీ... ఏమైంది?’’ అన్నాడు డ్రైవర్‌వైపు చూస్తూ ఆర్నాల్డ్. ‘ఒకసారి అటు చూడండి సర్’’ అన్నాడు డ్యానీ చేయి చాచి ఎదురుగా చూపిస్తూ. అందరూ అటువైపు చూశారు. ఓ అమ్మాయి కారుకు అడ్డుగా నిలబడింది. కారు కింద పడబోయి తప్పించుకున్న ట్టుంది... భయంతో వణికిపోతోంది. కారు దిగి ఆమె దగ్గరకు వెళ్లారు అందరూ. ‘‘సారీ అమ్మా... దెబ్బలేమీ తగల్లేదు కదా’’ అన్నాడు ఆర్నాల్డ్ అనునయంగా. ఆమె మాట్లాడలేదు. వణికిపోతూనే ఉంది. అంత చలిలోనూ చెమటలు పోస్తున్నాయి. కళ్లు భయంతో పెద్దగా విచ్చుకున్నాయి. రెప్ప కూడా వేయకుండా ఉండిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లాడు ఆర్నాల్డ్. భుజమ్మీద చేయి వేస్తే ఉలిక్కిపడిందామె. ‘‘నన్నేం చేయొద్దు... నీకు దణ్నం పెడతాను... నన్ను వదిలెయ్’’... బిగ్గరగా అరవసాగింది. అందరూ అవాక్కయ్యారు. గబగబా వెళ్లి ఆమెను పట్టుకున్నారు. ఎంత కంట్రోల్ చేయాలని చూసినా ఆమె ఊరుకోలేదు. అరుస్తూనే ఉంది. అరిచి అరిచి చివరకు స్పృహ కోల్పోయింది. ఆమెను కారులో వేసుకుని ఆస్పత్రికి బయలుదేరారు. ‘‘నేను... నేను ఎక్కడున్నాను?’’... కళ్లు తెరుస్తూనే ఉలిక్కిపడి లేచి కూర్చుందామె. భయంభయంగా చుట్టూ చూస్తోంది. ‘‘దేన్నో చూసి బాగా భయపడింది సర్. నన్ను వదిలెయ్ అని అరుస్తోందంటే ఆ భయానికి కారణం ఒక మనిషే అయి ఉండొచ్చు’’... చెప్పాడు డాక్టర్. అలాగా అన్నట్టు తల పంకించాడు ఆర్నాల్డ్. ఆమె దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించాడు. బెదిరి దూరంగా జరిగి పోతోంది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించాడు. తన పోలీసు తెలివితేటలతో చాకచక్యంగా మాట్లాడి ఆమె నమ్మకాన్ని గెల్చుకున్నాడు. ధైర్యం చెప్పాడు. దాంతో ఆమె నె మ్మదించింది. అప్పుడు అడిగాడు ఆర్నాల్డ్... ‘‘నీ పేరేమిటి? నీకు ఏమయ్యింది? అంత రాత్రివేళ... ఎందుకలా రోడ్డుమీద పరిగెడుతున్నావ్?’’ ఆ ప్రశ్నలు వినగానే ఆమె కళ్లలో మళ్లీ భయం పెరిగింది. ‘‘నా పేరు... నా పేరు... క్యారల్. నేను మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లి వస్తున్నాను. అప్పుడు... అప్పుడు...’’.. భయంతో మాట పెగల్లేదు. ‘‘డోన్ట్ వర్రీ క్యారల్. నేనున్నానుగా! ఏం జరిగిందో చెప్పు’’... అనునయంగా అన్నాడు ఆర్నాల్డ్. దాంతో మెల్లగా మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘పార్టీ అయ్యాక రోడ్డుమీదికొచ్చాను. ట్యాక్సీ స్టాండ్ వైపు నడుస్తుంటే చెప్పు జారి కాలు బెణికింది. దాంతో నడవలేక అక్కడే కూలబడిపోయాను. అంతలో ఓ కారు వచ్చి నా దగ్గర ఆగింది. లిఫ్ట్ కావాలా అంటే సరే అన్నాను. కానీ అతను... కారెక్కి కొంచెం దూరం వెళ్లాక రూటు మళ్లించేశాడు. ఎక్కడో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిపోయాడు. అరిస్తే కొట్టాడు. రేప్ చేయడానికి ప్రయత్నిం చాడు. ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాను. దార్లో మీ కారు కింద పడ్డాను.’’ తల పంకించాడు ఆర్నాల్డ్. ‘‘అతని గుర్తులు, ఆ కారు గుర్తులు చెప్పగలవా?’’ చెప్పిందామె. అతని గుర్తులు ఎక్కడా తెలిసినవిలా అనిపించలేదు. కానీ కారు గుర్తులు, నంబరు చెబుతుంటే ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. వెంటనే స్టేషన్‌కి వెళ్లి పాత ఫైళ్లు తిరగేశాడు. కొద్ది రోజుల క్రితం పెట్రోలింగ్‌లో ఉన్న ఓ పోలీసును గుద్దేసి వెళ్లిపోయిన కారు అది. అంటే వాడు పొరపాట్న యాక్సిడెంట్ చేసినవాడు కాదు. క్రిమినల్ అన్నమాట. వాడినెలా అయినా పట్టుకోవాలి. అనుకున్నదే తడవుగా వేట మొదలుపెట్టాడు ఆర్నాల్డ్. ఎట్టకేలకు అతని జాడ కనిపెట్టాడు. ‘‘ఎస్... ఎవరు కావాలి?’’... అడిగీ అడగడంతోనే అతని గూబ గుయ్మంది. కానీ అతను షాక్ తినలేదు. కొట్టినందుకు ఫీలవనూ లేదు. చాలా కూల్‌గా అన్నాడు... ‘‘అడిగితే కొడతారేంటి సర్?’’ ‘‘నువ్వే కావాలి మిస్టర్ టెడ్ బన్డీ’’ అంటూ చేతులకు బేడీలు వేశాడు ఆర్నాల్డ్. అప్పుడు కూడా అతను కంగారు పడలేదు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. ఇంటరాగేషన్ రూమ్‌లో కూడా అతని తీరు అదే. పోలీసుల కళ్లలోకి సూటిగా చూస్తున్నాడు. ఏదడిగినా చకచకా సమా ధానం చెబుతున్నాడు. ఓ నేరస్తుడు, తమ సమక్షంలో అంత కూల్‌గా ఉండటం చూసి విస్తుపోయారు పోలీసులు. ‘‘చెప్పు... క్యారల్ని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ప్రయత్నించావ్ కదూ?’’... ఆర్నాల్డ్ గొంతు కటువుగా పలికింది. ‘‘తెలిసే కదా అరెస్ట్ చేశారు?’’ చుర్రుమంది ఆర్నాల్డ్‌కి. లాగి ఒక్కటివ్వబోయి తమాయించుకున్నాడు. ‘‘కొద్ది రోజుల క్రితం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసాఫీసర్ మీద కారు ఎక్కించి, ఆగ కుండా వెళ్లిపోయావ్. అప్పుడు తప్పించు కున్నావ్ కానీ ఇప్పుడు దొరికిపోయావ్.’’ ‘‘కావాలని గుద్దలేదు. ఒక అమ్మాయి నా నుంచి పారిపోయింది. ఆమెను పట్టుకునే క్రమంలో వేగంగా డ్రైవ్ చేశాను. పొరపాటున మీ ఆఫీసర్ని గుద్దేశాను. అంతే.’’ విస్తుపోయాడు ఆర్నాల్డ్. క్షణం పాటు మాట్లాడలేక పోయాడు. అతడు మౌనంగా అయిపోవడం చూసి టెడ్ అన్నాడు... ‘‘షాక్ తిన్నారు కదూ! నాకిది మామూలే. మీరు ఇప్పుడే వింటున్నారు కదా... అందుకే అంతగా షాకవుతున్నారు.’’ ఇంకా బుర్ర తిరిగిపోయింది ఆర్నాల్డ్‌కి. అతణ్ని ఇక పెద్దగా శ్రమ పెట్టకుండానే టెడ్ తన గురించిన నిజాలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు. 1946లో ఓ పెళ్లికాని అమ్మాయి కడుపున పుట్టాడు టెడ్. ఊహ తెలిసి నప్పటి నుంచీ తన తండ్రి ఎవరో తెలుసు కోవాలని తపన పడ్డాడు. తల్లి చెప్పలేదు. కలత చెందాడు. తండ్రి ఎవరో తెలియని బిడ్డగా తనను ఈ లోకానికి తెచ్చిన తల్లిమీద అయిష్టాన్ని పెంచుకున్నాడు. ఆ బాధ, కోపం, విసుగు అన్నీ కలసి అతడి మనస్తత్వాన్ని విచిత్రంగా తయారు చేశాయి. ఎదుటివాళ్లు బాధపడితే చూడ టంలో ఆనందం కలిగేది. ఉండేకొద్దీ కావాలని ఇతరులను బాధపెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత తన తల్లిని పెళ్లాడిన వ్యక్తి తనను చేరదీసినా అతనికి దగ్గర కాలేకపోయాడు. అతని పిల్లలతో తనను సమానంగా చూసినా ఆనందించ లేకపోయాడు. అతని పిల్లలను హింసించే వాడు. ఓసారి చెల్లెల్ని మేడమీది నుంచి కూడా తోసేశాడు. దాంతో టెడ్‌ని హాస్టల్లో చేర్పించారు. హాస్టల్ జీవితం టెడ్కి చాలా నచ్చింది. అక్కడతని ఆలోచనల్ని, చేతల్ని గుర్తించేవారెవరూ లేకపోవడంతో టెడ్‌లో వికృతత్వం పురులు విప్పుకుంది. ఏదో తెలియని కసి పెరిగింది. అది ఎలా తీర్చు కోవాలా అని చూసేవాడు. సైకాలజీలో డిగ్రీ చేసి, లా కాలేజీలో చేరాడు. సరిగ్గా అదే సమయంలో టెడ్ ప్రేమించిన యువతి అతనితో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయింది. తట్టుకోలేకపోయాడు. అన్నే ళ్లుగా అతనిలో అణచి పెట్టిన ఉన్మాది ఒక్క సారిగా బయటకు వచ్చాడు. తన మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టాడు. దారుణంగా రేప్ చేసి చంపేశాడు. అతడిలో ఏదో ఆనందం! అంతే... నాటి నుంచీ మొదలైంది టెడ్ నేరాల పరంపర. రాత్రిళ్లు ఒంటరిగా కనిపించిన అమ్మాయిలకు లిఫ్ట్ పేరుతో ఎర వేసే వాడు. కారు ఎక్కాడ కిడ్నాప్ చేసి తీసుకు పోయేవాడు. తన కారులోనే చిత్రహింసలు పెట్టేవాడు. అలా మొత్తం ముప్ఫై మందికి పైగా అమ్మాయిలను పొట్టన పెట్టుకు న్నాడు. కొందరిని చంపడానికి ముందే రేప్ చేశాడు. కొందర్ని చంపేశాక వారి మృతదేహాలతో కోరిక తీర్చుకున్నాడు. తన మాజీ గాళ్ఫ్రెండ్లాగా నీలి కళ్లు, నల్లని జుత్తు ఉన్న అమ్మాయిలంటే టెడ్కి పిచ్చి. అలాంటి అమ్మాయిల్ని చంపేసి, వారి మృతదేహాలు కుళ్లి కృశించే వరకూ వాటి తోనే గడిపేవాడు. కొందరి తలల్ని తన ఇంట్లో ట్రోఫీల్లాగా దాచుకున్నాడు. టెడ్ పైశాచికత్వానికి న్యాయస్థానం సైతం ఉలిక్కిపడింది. ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టి ప్రాణాలు తీయమంటూ ఆదేశించింది. 1989, జనవరి 24న ఆ శిక్ష అమలయ్యింది. ఆ మానవమృగం ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది. విచిత్రం ఏమిటంటే... చనిపోయే ముందు కూడా టెడ్ కాస్తయినా పశ్చాత్తాపపడక పోవడం. చనిపోతున్నందుకు బాధగా లేదా అని అడిగితే... ‘‘నాకు నచ్చింది నేను చేశాను... మీరు చేయాల్సింది మీరు చేయండి’’ అన్నాడు టెడ్. అతడికి మరణ శిక్ష వేయడమే న్యాయమని ఆ చివరి మాటలు సైతం రుజువు చేశాయి! టెడ్‌ని అరెస్ట్ చేసిన తర్వాత అతని కారును సీజ్ చేశారు పోలీసులు. అప్పుడా కారులో ఉన్న మారణాయుధాలను చూసి షాక్ తిన్నారు వాళ్లు. రకరకాల చాకులు, చిత్ర విచిత్రమైన కత్తులు ఉన్నాయి ఆ కారులో. పైగా రక్తం ఇంకిపోయి సీట్లు రంగు మారిపోయాయి. దానికి తోడు భరించలేని దుర్వాసన. తాను చాలా హత్యలు ఈ కారులోనే చేయడంతో దాని పరిస్థితి అలా తయారైందని విచారణలో చెప్పాడు టెడ్!