
Best Fantasy Movies On Amazon Prime Video May 2022: 'సినిమా.. సినిమా.. సినిమా.. ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవైడ్.. బట్ ! సినిమా లైక్స్ మీ.. ఐ కాంట్ అవైడ్' అంటారు మూవీ లవర్స్. ఈ సినీ ప్రియులకి జోనర్స్‌తో పనిలేదు. వైవిధ్యంగా ఎలాంటి జోనర్‌లో మూవీస్ వచ్చిన బ్రేక్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, హార్రర్, యాక్షన్, ఫాంటసీ, స్కైఫై వంటి తదితర జోనర్‌లలో సినిమాలు కాస్త డిఫరెంట్‌గా ఉండి ఎంటర్‌టైన్ చేస్తే చాలు హిట్ ఇచ్చి ఎక్కడికో తీసుకుపోతారు. ఇక మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా వచ్చాయి ఓటీటీలు. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వెబ్ సిరీస్, మూవీస్‌లను రూపొందిస్తూ తమ సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి.
డిఫరెంట్ జోనర్స్‌తో వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. అలాగే వాస్తవికతకు దూరంగా ఉండి ఊహలోకపు అంచుల్లో విహరించేలా చేస్తాయి ఫాంటసీ జోనర్ సినిమాలు. మరీ ఈ అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకునే ఆ ఫాంటసీ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దామా !
1. అక్వామాన్
2. ది లెజెండ్ ఆఫ్ టార్జాన్
3. కాంగ్: ది స్కల్ ఐలాండ్
4. స్నో వైట్ అండ్ ది హంట్స్‌మాన్
5. టెడ్
6. మూన్‌షాట్
7. సిండ్రెల్లా
8. ది కోబ్లార్
Comments
Please login to add a commentAdd a comment