Fantasy Film
-
మెగా 156 షురూ
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘మెగా 156’(వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. యువీ క్రియేష¯Œ ్సపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో మొదలైంది. ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఈ సెట్స్‌లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
అతీంద్రియ శక్తులే కథాంశంగా వస్తున్న 'చిరో'
ప్రముఖ నిర్మాత ఎంఎస్ మంజూర్ రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. విభిన్న కథా చిత్రాలను నిర్మించాలన్న ఆసక్తితో ఈయన ప్రస్తుతం మిలియన్ స్టూడియోస్ పతాకంపై సత్యరాజ్ కథానాయకుడిగా వెపన్ అనే వైవిధ్య భరితమైన కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలోనే పరిశ్రమ వర్గాల్లో మంచి అటెన్షన్‌కు గురిచేస్తోంది. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత తదుపరి నిర్మిస్తున్న మరో చిత్రం చిరో. ఇంతకు ముందు పలు యాడ్ ఫిలిమ్స్ చేసిన వివేక్ రాజారామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర కథలు చెప్పగానే నిర్మాతలు మంజూర్, అబ్దుల్ చాలా ఇంప్రెస్స్ అయ్యారన్నారు. ఇది ఒక్క జానర్లో సాగే కథాచిత్రంగా ఉండదని.. ప్రతి 20, 25 నిమిషాలకు జానర్ మారుతుందని ఆయన చెప్పారు. అతీంద్రియ శక్తులు కలిగిన యువతి కథే అతీంద్రియ శక్తులు కలిగిన ఓ యువతి ఇతివృత్తమే ఈ చిత్రం అన్నారు. ఇందులో కథానాయకిగా ప్రార్థనా చాబ్రియ నటించనున్నారని చెప్పారు. ఈమెది ఫాంటసీతో కూడిన ఫిక్షన్ కథా పాత్రగా ఉంటుందన్నారు. నటి ప్రార్థనా చాబ్రియను కలిసినప్పుడు ఆమె మాత్రమే ఈ పాత్రను చేయగలరని భావించారన్నారు. చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిషన్ సీవీ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. View this post on Instagram A post shared by Million Studio (@millionstudioss) -
ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!
రాజుల కాలంలో అంతఃపురం ఎలా ఉండేది అంటే.. ఇలా ఉంటుందేమో అని సినిమాలు చూపించాయి. మరి.. స్వర్గలోకం ఎలా ఉంటుంది? అంటే.. ఈ లోకాన్ని కూడా ఊహించి, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొత్త ప్రపంచాలను చూపించనున్నాయి. ఊహాజనిత కథలతో సాగే ఈ చిత్రాల కోసం భారీ సెట్స్‌తో కొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్వర్గం నేపథ్యంలో... ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ఈ చిత్రంలో కొన్ని సీన్లు స్వర్గం నేపథ్యంలో ఉంటాయి. తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమా మళ్లీ ప్రేక్షకులను స్వర్గలోకంలోకి తీసుకెళ్లనుందని టాక్. గత ఏడాది కల్యాణ్ రామ్‌తో ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందనుందని టాక్. ‘బింబిసార’ తరహాలోనే ఫ్యాంటసీ జానర్లో ఉండే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఊహాజనిత స్వర్గం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. సాహసాల ధీర ‘ధీర’గా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లనున్నారట అఖిల్. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్‌లో ఒకరైన అనిల్‌కుమార్ ఇటీవల అఖిల్‌కు ఓ కథ చెప్పారు. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని సమాచారం. నాలుగు పేజీల భైరవకోన ప్రేక్షకులను ‘భైరవకోన’కు తీసుకెళ్తామంటున్నారు సందీప్ కిషన్. ‘టైగర్’ (2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. ‘శ్రీకృష్ణదేవరాయల కాలంలోని గరుడ పురాణానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఈ నాలుగు పేజీలే భైరవకోన’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. అంజనాద్రి వీరుడు ‘హను–మాన్’ చిత్రం కోసం ‘అంజనాద్రి’ అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమంతుని శక్తులు పొందిన ఓ యువకుడు ‘అంజనాద్రి’ రక్షణ కోసం ఎలాంటి పోరాటాలు, సాహసాలు చేశాడు అనే అంశాలతో ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. తేజా సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘అధీర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా కాస్త ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కె. నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. -
అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ 'ఫాంటసీ' మూవీస్ ఇవే..
Best Fantasy Movies On Amazon Prime Video May 2022: 'సినిమా.. సినిమా.. సినిమా.. ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవైడ్.. బట్ ! సినిమా లైక్స్ మీ.. ఐ కాంట్ అవైడ్' అంటారు మూవీ లవర్స్. ఈ సినీ ప్రియులకి జోనర్స్‌తో పనిలేదు. వైవిధ్యంగా ఎలాంటి జోనర్లో మూవీస్ వచ్చిన బ్రేక్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, హార్రర్, యాక్షన్, ఫాంటసీ, స్కైఫై వంటి తదితర జోనర్లలో సినిమాలు కాస్త డిఫరెంట్‌గా ఉండి ఎంటర్టైన్ చేస్తే చాలు హిట్ ఇచ్చి ఎక్కడికో తీసుకుపోతారు. ఇక మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా వచ్చాయి ఓటీటీలు. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వెబ్ సిరీస్, మూవీస్లను రూపొందిస్తూ తమ సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. డిఫరెంట్ జోనర్స్‌తో వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. అలాగే వాస్తవికతకు దూరంగా ఉండి ఊహలోకపు అంచుల్లో విహరించేలా చేస్తాయి ఫాంటసీ జోనర్ సినిమాలు. మరీ ఈ అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకునే ఆ ఫాంటసీ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దామా ! 1. అక్వామాన్ 2. ది లెజెండ్ ఆఫ్ టార్జాన్ 3. కాంగ్: ది స్కల్ ఐలాండ్ 4. స్నో వైట్ అండ్ ది హంట్స్మాన్ 5. టెడ్ 6. మూన్‌షాట్ 7. సిండ్రెల్లా 8. ది కోబ్లార్ -
సినిమా గుర్రాలు
గంగిశెట్టి వేణుగోపాల్, విజయవాడ ‘అరే కరీనా ఆజా’ అనగానే దగ్గరకొచ్చి నిలబడుతుంది. ‘అలెక్స్ బేటా ధీరే ధీరే’అనగానే పరుగులు తీసేది కాస్తా నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ‘బాదల్ భ య్యా... గ్యాలప్’ అనగానే మందటి కాళ్లు పెకైత్తి పరుగందుకుంటుంది. ‘శబ్బాష్ బేటా శబ్బాష్’ అంటూ రియాజ్ ప్రేమగా నిమరగానే రిలాక్సయిపోతుంది. ఇవన్నీ సినిమా గుర్రాలు. పదేళ్ల నటనానుభవం వీటి సొంతం. స్టార్ట్ కెమెరా... యాక్షన్... చెప్పగానే పరుగందుకోవడమూ, కట్ చెప్పగానే ఆగిపోవడమూ వీటికి తెలుసు. అందుకే ఈమధ్య కాలంలో వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాల్లో వాటికి తగ్గ పాత్రలు చేశాయి. మగధీర, గబ్బర్‌సింగ్, దేవరాయ, రాజన్న లాంటి సినిమాల్లో అగ్రహీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ మార్వాడీ జాతి గుర్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న రుద్రమదేవి, బాహుబలి చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించనున్నాయి. భాగ్యనగరాన్ని నిజాం నవాబులు పరిపాలిస్తున్న రోజుల్లో రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లా జూలూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జమాలుద్దీన్ అశ్వశాల పరిరక్షకుడిగా పనిచేసేవారు. నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ కోసం మేలు రకం గుర్రాలను పెంచేవాడు. ఆయన కుమారుడు మహ్మద్ షంషుద్దీన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ హైదరాబాద్ జూ పార్కులో ఒంటెలు, ఏనుగులు, గుర్రాల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈయనకు ఆరుగురు సంతానం. వీరంతా అశ్వశాలలను నడుపుతూ హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. 15 ఏళ్ల కిందట మహ్మద్ అస్లాం అండ్ కంపెనీని స్థాపించి సినిమా షూటింగుల కోసం ఏనుగులు, గుర్రాలు, ఒంటెలను సరఫరా చేయడం ప్రారంభించారు. గుర్రాల పోషణలో విశేష అనుభవాన్ని గడించిన రియాజ్, అజమ్ పదేళ్ల కిందట విజయవాడకు సమీపంలోని ఉండవల్లి ప్రాంతంలో కొత్త అశ్వశాలను ప్రారంభించారు. మార్వాడీ, కాటెవాడీ జాతులకు చెందిన మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ సంతతిని తెచ్చి పోషించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వీరి దగ్గర 66 మేలు జాతి గుర్రాలున్నాయి. ఇందులో 40 దాకా సినిమా షూటింగుల్లో ఉండగా, మిగతావన్నీ స్థానికంగా జరిగే దేవతల ఊరేగింపులు, వివాహ కార్యక్రమాలకు హాజరవుతున్నాయి. ‘మగధీర’తో మంచి క్రేజ్... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరలో కాజల్‌ను చూసేందుకు రామ్‌చరణ్ గుర్రంపై వేగంగా ఫాలో అవుతాడు. ఆ గుర్రం పేరు బాదల్. సినిమాలో పేరు బాషా. గబ్బర్‌సింగ్ చిత్రంలో పవన్‌కల్యాణ్ స్వారీ చేసిన గుర్రం స్మార్ట్ చాంపియన్. రుద్రమదేవిలో రూప నటిస్తోంది. బాహుబలిలో కనిపించబోయే బులెట్ రాజా, మహాబలేశ్వర్, అలెక్స్, మ్యాంగో అన్నీ రియాజ్, అజమ్ల కంపెనీవే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, శ్రీకాంత్, రానా, అనుష్క, కాజల్, ఆలీ వంటి నటీనటులందరూ వీటిపై మక్కువతో సవారీ చేశారు. మా అన్నదమ్ముల కుటుంబాలన్నీ గుర్రాల ద్వారా వచ్చే ఆదాయంపైనే జీవనం సాగిస్తుంటాయి. మాకు పెద్దగా చదువులు లేకపోయినా వంశపారంపర్యగా మేలు జాతి గుర్రాలు, ఏనుగులను పోషిస్తున్నాం. వీటికి రోజూ శనగలు, గోధుమపిండితో దాణా అందించడమే కాకుండా మాలిష్ చేయడం, సమయానికి మందులు వాడటం చేయాల్సి ఉంటుంది. రాత్రి వేళ అశ్వశాలలలోనికి దొంగలు చొరబడకుండా ై‘నెట్ కింగ్’ గుర్రం కాపలా కాస్తుంది. మేం చెప్పిన మాటలన్నీ వాటికి అర్థమవుతాయ్. అందుకే సినిమా షూటింగుల్లో ఇబ్బందులు తలెత్తడం లేదు. - మహ్మద్ అజమ్, గుర్రాల పోషకుడు, ఉండవల్లి