Prarthana Chabbria Acts As Lead Role In Tamil Movie 'Chiro' - Sakshi
Sakshi News home page

Chiro Movie: అతీంద్రియ శక్తులు కలిగిన ఓ యువతి కథే 'చిరో'

Aug 11 2023 3:13 PM | Updated on Aug 11 2023 3:23 PM

Prarthana Chabbria Acts As Lead Role In Tamil Movie Chiro - Sakshi

ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ మంజూర్‌ రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. విభిన్న కథా చిత్రాలను నిర్మించాలన్న ఆసక్తితో ఈయన ప్రస్తుతం మిలియన్‌ స్టూడియోస్‌ పతాకంపై సత్యరాజ్‌ కథానాయకుడిగా వెపన్‌ అనే వైవిధ్య భరితమైన కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలోనే పరిశ్రమ వర్గాల్లో మంచి అటెన్షన్‌కు గురిచేస్తోంది. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత తదుపరి నిర్మిస్తున్న మరో చిత్రం చిరో.  ఇంతకు ముందు పలు యాడ్‌ ఫిలిమ్స్‌ చేసిన వివేక్‌ రాజారామ్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు.

 ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర కథలు చెప్పగానే నిర్మాతలు మంజూర్‌, అబ్దుల్‌ చాలా ఇంప్రెస్స్‌ అయ్యారన్నారు. ఇది ఒక్క జానర్లో సాగే కథాచిత్రంగా ఉండదని.. ప్రతి 20, 25 నిమిషాలకు జానర్‌ మారుతుందని ఆయన చెప్పారు.

అతీంద్రియ శక్తులు  కలిగిన యువతి కథే

 అతీంద్రియ శక్తులు కలిగిన ఓ యువతి ఇతివృత్తమే ఈ చిత్రం అన్నారు. ఇందులో కథానాయకిగా ప్రార్థనా చాబ్రియ నటించనున్నారని చెప్పారు. ఈమెది ఫాంటసీతో కూడిన ఫిక్షన్‌ కథా పాత్రగా ఉంటుందన్నారు. నటి ప్రార్థనా చాబ్రియను కలిసినప్పుడు ఆమె మాత్రమే ఈ పాత్రను చేయగలరని భావించారన్నారు. చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్‌ రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిషన్‌ సీవీ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement