netra
-
రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి!
ఆరవ తరగతి చదువుతున్న చిన్నారి ఒంటరితనాన్ని అధిగమించేందుకు పెంపుడు జంతువును దత్తత తీసుకోలేని వారికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ పెట్‌ను ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచింది. ప్రతి ఏడాది 6 లక్షల పెంపుడు జంతువులను దేశ వ్యాప్తంగా దత్తత తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఆర్థిక స్థోమత ఉంది. కానీ పెంపుడు జంతువును దత్తత తీసుకుని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది అందరికీ అది సాధ్యపడక పోవచ్చు. అలాంటి వారికి 12 ఏళ్ల చిన్నారి విద్యార్థి నేత్ర సింగ్ అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ పెట్ చక్కగా ఉపకరిస్తుంది. ఈ మేరకు బోవెన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నేత్ర సింగ్ పెంపుడు జంతువులకు ప్రత్యామ్నాయంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి మరీ ఈ రోబోటిక్ పెట్ని అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, సహచరులతో సహా వెయ్యి మందితో కూడిన టెడ్ సమావేశంలో ప్రదర్శించడమే దీని ఉపయోగాలు గురించి మాట్లాడింది నేత్ర. రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని నయం చేయడంలో సహాయపడటమేగాక మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పింది. ఆ సమావేశంలో నేత్ర మాట్లాడుతూ..ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువుల దత్తత పెరిగింది. అదీగాక పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. ఈ పెంపుడు జంతువులు డెలివరీ బాయ్‌లను భయపెట్టడంతో చనిపోయిన ఘటనలను కూడా చేశాం. ఇంకోవైపు వీధికుక్కలు పసిపిల్లలపై దాడి చేసి చంపిన ఘటనలను కూడా రోజుకి ఒకటి వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నేత్ర సింగ్ చెబుతున్న రోబోటిక్ పెట్ ఆలోచనను అందర్నీ ప్రేరేపించింది. తన పాఠశాల నిర్వహించిన బోవెన్పల్లిలోని దాని ప్రాంగణంలో 'స్టార్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్--యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో టెడ్(TED)లాంటి చర్చలో భాగంగా నేత్ర తన ఆలోచన పంచుకుంది. ఈ ఆలోచనకు గానూ ఆమెకు అందరి నుంచి ప్రశంసలు అందాయి. "నేను ఇప్పటికీ దానిపై పని చేస్తున్నాను. ప్రస్తుతానికి, ఇది నా ఆలోచన. నేను దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి ప్రొఫెషనల్ మెంటరింగ్ని కోరుకుంటున్నానని ధీమాగా చెప్పుకొచ్చింది" విద్యార్థి నేత్ర. ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ నేత్ర ఆలోచనలు తోపాటు పాఠశాలలోని మరో 50 మంది విద్యార్థుల ఆలోచనల విన సంతోషం వ్యక్తం చేశారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రోబోటిక్ పెట్ అనేది ఒక వినూత్న ఆలోచన అని డాక్టర్ కె. సువర్ణ చెప్పారు. ఈ చర్చలో 50కిపైగా విద్యార్థులు తమ కొత్త ఆలోచనలు, దృక్కోణాలను పంచుకున్నారు. విద్యార్థులు మెరుగైన పనితీరు రెండు నిమిషాల నిడివి గల సందేశాలు, రీల్స్, షార్ట్‌లు, వాట్సాప్ స్టేటస్ వీడియోల రూపంలో కనబర్చేలా టెడ్ (TED) లాంటి షార్ట్ టాక్లతో ముందుకు వచ్చింది సెయింట్ పీటర్స్ హైస్కూల్. పాఠశాలకు చెందిన వరేణ్య, ప్రీతమ్, శామ్యూల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఫైర్ అండ్ గ్యాస్ లీకేజ్ ఫిక్టర్ రోబోట్‌ను సమర్పించాయి. ఇది CBSE రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఎంపికైంది. జనవరి 2024లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రదర్శనలో పాల్గొంటుంది. నమోదు చేసుకున్న 3169 విద్యార్థి జట్లలో ఎంపిక చేసిన 30 ప్రదర్శనలలో సెయింట్ పీటర్స్ జట్టు ఒకటి. టెడ్ (TED) లాంటి చర్చలు పంచుకోవడానికి విలువైన ఆలోచనల కోసం పాఠశాల స్థాయి వేదిక. ఇది కూడా కేవలం ఎలివేటర్ ప్రయాణ సమయంలో ఐడియాను పంచుకుని, ప్రభావితం చేయగలిగే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం. 1979లో ప్రారంభమైన ఈ పాఠశాల 24 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో లోగొను ఆవిష్కరించి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోనుంది. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
తెలంగాణ నేపథ్యంలో...
నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుధీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొక్కిలి’. మహేష్ గంగిమళ్ల దర్శకత్వంలో వీఆర్‌జీఆర్ మూవీస్‌పై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్‌తో పాటు పోస్టర్ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ‘‘తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో, వాస్తవ ఘటనలతో రూ΄÷ందుతోన్న చిత్రం ‘΄÷క్కిలి’. క్లైమాక్స్, రెండు ΄ాటలు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయ΄ాల్ నిమ్మల. -
పెరియ విరాళం
నేత్ర... పదమూడేళ్ల అమ్మాయి. తొమ్మిదో తరగతి చదువుతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన మానవాభిృద్ధి, శాంతివిభాగం (అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్) ఈ అమ్మాయిని ‘గుడ్‌విల్ అంబాసిడర్ ఫర్ ద పూర్’గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం నాడు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి నేత్రకు అభినందనలు తెలియచేశారు. నోటిమాటగా అభినందనలతో సరిపెట్టలేదు, నేత్ర ఉన్నతవిద్యకు అవసరమైన ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు ముఖ్యమంత్రి పళనిస్వామి. నేత్ర తాను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పింది. కష్టం తెలిసిన బాల్యం లాక్డౌన్ సమయంలో పేదప్రజలు పడుతున్న కష్టాలను చూసి నేత్ర పెద్దమనసుతో స్పందించింది. వలస కార్మికులకు సహాయం చేయడానికి, వారికి నిత్యావసరాలను అందించడానికి ముందుకు వచ్చింది. పదమూడేళ్ల అమ్మాయి ఇచ్చే విరాళం అంటే... పుట్టినరోజు నాడు అమ్మమ్మ, నానమ్మ ఏదైనా కొనుక్కోమని ఇచ్చిన వెయ్యి రూపాయలో, రెండు వేలో కాదు. తల్లీతండ్రీ ఈ అమ్మాయి చదువు కోసం కూడబెట్టిన ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బునంతటినీ వలస కార్మికుల కోసం విరాళంగా ఇవ్వడానికి అమ్మానాన్నలను ఒప్పించింది. అంత డబ్బు ధారాళంగా విరాళం ఇవ్వడానికి ఆమె అమ్మానాన్నలు సంపన్నులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదు. నేత్ర తండ్రి మోహన్ సెలూన్ నడుపుతాడు. కూతురి కోరిక ప్రకారం మోహన్, నేత్ర తల్లి పండిసెల్వి మే 2న అన్నానగర్ పోలీసులను సంప్రదించారు. వలసకార్మికుల అవసరాల కోసం ఉపయోగించమని ఆ డబ్బును ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు. ఈ సంగతి తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రస్తామించి, నేత్ర దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. పేదవాళ్ల కష్టం చూసి ఆమె స్పందించిన తీరుకు ప్రశంసలు అందుతున్నాయి. నేత్ర మాత్రం ‘‘కొన్నేళ్ల కిందట మా కుటుంబం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నది. కనీస అవసరాలకు కూడా డబ్బు ఉండేది కాదు. పేపర్లలో వలసకార్మికులు పడుతున్న బాధల గురించి చదివినప్పుడు మేము పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయి. నా చదువు కోసం మళ్లీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న డబ్బు ఇచ్చేద్దాం... అని పట్టుపట్టాను’’ అని చెప్పింది. రాష్ట్ర మంత్రి సెల్లూర్ కె రాజు ‘‘నేత్ర మా మధురై జిల్లాకే గర్వకారణం. ఆమెకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద అవార్డు ఇవ్వడానికి ముఖ్యమంత్రికి సిఫారస్ చేస్తాన’’ని చెప్పారు. నేత్రకు న్యూయార్క్, జెనీవాలలో జరిగే ఐరాస సదస్సుల్లో ప్రసంగించే అవకాశం ఇస్తున్నట్లు యూఎన్ శాంతి పరిరక్షక విభాగం తెలియచేసింది. -
మంచి మనసుకు మన్నన
సాక్షి, చెన్నై: సేవాతత్వం, మానవీయత వెరసి మదురై బాలిక నేత్రను అందలం ఎక్కించింది. తన తండ్రి మోహన్‌తో కలిసి లాక్డౌన్ కష్టాల్లో ఉన్న బాధితుల్ని ఆదుకున్న ఆ బాలిక సేవాతత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ బాలికలోని మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. కరోనా కట్టికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పేదల్ని ఆదుకునే దిశగా ఎన్నో మావనతా హృదయాలు కదిలాయి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు సేవల్లో మునిగారు. మరెందరో వివిధ పనుల నిమిత్తం తాము దాచుకున్న సొమ్మును విరాళంగా అందించారు. ఈ పరిస్థితుల్లో మదురై మేలమడైకు చెందిన 9వ తరగతి విద్యార్ధిని నేత్ర(14) మంచి మనసు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. హెయిర్ కటింగ్ దుకాణం నడుపుతున్న నేత్ర తండ్రి మోహన్, కూతురు చదువుల కోసం దాచుకున్న రూ. 5 లక్షల్ని కష్టాల్లో ఉన్న పేదల సేవకు ఉపయోగించారని ప్రధాని వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా నేత్ర కుటుంబానికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా నేత్రకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం అందింది. ఐరాస అంబాసిడర్‌గా.. నేత్ర సేవ, మానవీయత ఎల్లలు దాటింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం ఆ బాలికకు వరంగా మారింది. ఆమె సేవ, మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి తమ అంబాసిడర్‌గా ప్రకటించింది. “గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్రను నియమిస్తూ శుక్రవారం ప్రకటన వెలువడింది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జెనీవాలో జరగనున్న సమావేశంలో పేదరికం గురించి నేత్ర ప్రత్యేక ప్రసంగం ఇవ్వబోతున్నారు. అలాగే, ఆమె విద్యా ఖర్చులకు లక్ష రూపాయల ‘డిక్సన్ స్కాలర్షిప్’ను మంజూరు చేసింది. అరుదైన ఆహ్వానంసపై నేత్ర ఆనందం వ్యక్తం చేసింది. మోదీ ప్రశంస, తాజాగా తనకు గౌరవం దక్కడం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎంతో ఆనందంగా ఉందని, పేదరికం గురించి ఐరాస వేదిక మీద ప్రసంగించి అందర్నీ మన్ననలు పొందుతానని తెలిపారు. సేవా రంగంలో ముందుకు సాగాలన్న తన ఆకాంక్షకు ఐరాస ఆహ్వానం మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. ఒక్క భారత దేశంలోని పేదరికం గురించి మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాల్లోని పేదరికం గురించి తన ప్రసంగం ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మాట్లాడుతూ.. ఇది తమిళనాడుకు ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. అందరికి నేత్ర ఆదర్శంగా నిలిచిందన్నారు. సేవాతత్వంతో ముందుకు సాగే వారికి ఇలాంటి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని నేత్ర చాటిందన్నారు. -
మై స్వీట్ హార్ట్
గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అన్నది ఉప శీర్షిక. రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘వైజాగ్’ సత్యానంద్‌గారు కీలక పాత్ర చేశారు. వారి అబ్బాయి ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఉదయ్ నాగ్ రతన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్‌కి తీసుకెళుతుంది’’ అన్నారు. ‘‘మేం అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చింది. రిజల్ట్ విషయంలో నమ్మకంగా ఉన్నాం. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ ఈ చిత్రం నచ్చుతుంది’’ అని నిర్మాత రాము పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. గోపాల్. -
స్వీట్ హార్ట్
‘‘నేత్ర’ చిత్రదర్శకుడు యాదకుమార్ నా శిష్యుడే. నేనిప్పటి వరకు 149 మందిని యాక్టర్స్‌గా తీర్చిదిద్దా. వారిలో తొంభై ఐదు మంది హీరోలయ్యారు. నేను, నా కుమారుడు కలిసి తొలిసారి ఈ చిత్రంలో నటించాం’’ అని వైజాగ్ సత్యానంద్ అన్నారు. గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మించిన చిత్రం ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. ఉదయ్‌నాగ్ రతన్ దాస్ స్వర పరచిన ఈ చిత్రం పాటలను నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ‘‘లవ్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. పీరికట్ల రాము, గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల, ఉదయ్‌నాగ్ రతన్ దాస్, నిర్మాత రామ సత్యనారాయణ, నటుడు శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు. -
నేత్ర ఎవరు?
గోపీచరణ్, ఐశ్వర్య జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తున్న సినిమా ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్... అనేది ఉపశీర్షిక. ‘‘ఈ నెలలో ఆడియో, నవంబర్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘లవ్ అండ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్. ‘నేత్ర’ ఎవరు? ఆమె ఎవర్ని ప్రేమించింది? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరం. స్టార్ మేకర్ సత్యానంద్, వాళ్లబ్బాయి కలసి నటించిన మొదటి చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు.