
ఏనుగులు వన్య ప్రాణులు. అవి అడవుల్లోనే ఉండాలి.. అంతేకానీ గొలుసులతో బంధించకూడదని అనుకున్నారు కొందరు. అందుకే నిజం ఏనుగులను తలపించేలా.. రోబో ఏనుగులను సృష్టించారు కేరళలో. తద్వారా ఏనుగులకు కష్టాలను దూరం చేయాలనుకుంటున్నారు. ఇక.. భక్తుల భద్రత గురించి ఆలోచన చేసిన కొన్ని ఆలయాల నిర్వాహకులు వీటిని ప్రొత్సహిస్తూ అందరిచేత అభినందనలు అందుకుంటున్నారు.
















