
లండన్: మనం ఎంత శక్తివంతులమైనా.. బలవంతులం, గొప్పవారం, ధనవంతులమైనా సరే.. లేచిన వేళా విశేషం బాగాలేకపోతే.. ఏం చేయలేం. ఆ రోజు మన కోసం ఎదురు చూస్తున్న అన్ని సంఘటనలను ఎదుర్కొవాల్సిందే. అవి మంచివే కానీ చెడ్డవే కానీ తప్పదు. సామాన్యుల విషయంలో ఏం జరిగినా ప్రపంచం పెద్దగా పట్టించుకోదు.. అదే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న వార్త, సంఘటనను సైతం పెద్దగా ప్రచారం చేస్తుంది. వారికి ఎదురైన అనుభవాలను సోషల మీడియా వేదికగా బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్త ఇబ్బందికర సంఘటనను ఎదుర్కొన్నారు. అతడి ఇబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైలరవుతోంది. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం బోరిస్ జాన్సన్ విధులు నిర్వహిస్తూ.. మరణించిన పోలీసు అధికారుల కోసం ఏర్పాటు చేసిన స్మారక సేవ కార్యక్రమానికి హాజరయ్యారు. వర్షం పడుతుండటంతో దానికి వచ్చినవారిలో కొందరు గొడుగులతో హాజరయ్యారు. బోరిస్ జాన్సన్ కూడా గొడుగుతో హాజరయ్యారు. అయితే ఆ గొడుగు జన్సాన్‌ని తెగ సతాయించింది. మొదటి అది తెరుచుకోలేదు. ఎలాగోలా ప్రయత్నించి.. దాన్ని తెరిస్తే.. ఆ తర్వాత అది గాలికి తట్టుకోలేక రివర్స్ అయ్యింది.
ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ కూడా హాజరయ్యారు. గొడుగుతో కుస్తీ పడుతున్న జాన్సన్‌ని చూసి చార్లెస్‌తో సహా అక్కడున్న అధికారులంతా ముసి ముసి నవ్వులు నవ్వుతారు. తన పరిస్థితిని తలుచుకుని జాన్సన్ కూడా చిరు నవ్వులు చిందిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని స్కై న్యూస్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
....up, up and nearly away ☂️
— Sky News (@SkyNews) July 28, 2021
PM Boris Johnson struggles with his umbrella whilst seated next to Prince Charles at a memorial recognising the sacrifice of police officers who have died on duty.
Read more here: https://t.co/ia9HUvj5LD pic.twitter.com/dCcMiVcwyn
‘‘రెండు రోజులు గడిచిందేమో.. ఈ సారి గొడుగు విషయంలో చిక్కుకున్నారు. తనకు కొత్త గొడుగు కొనివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని అడుగుతాడేమో.. లేక మీడియా దీన్ని మరో నెలరోజుల పాటు వాల్‌పేపర్ స్టోరీగా ప్రచురిస్తుంది’’ అని కామెంట్ చేయగా.. మరికొందరు ‘‘నాకు ప్రతిసారి ఇదే అనుభవం ఎదురవుతుంది’’.. నీకు ఎంత ధైర్యం దేశ ప్రధానినే ఇలా ఇబ్బందిపెడుతూ సతాయిస్తావా.. హమ్మా’’ అంటూ కామెంట్ చేయసాగారు.
Comments
Please login to add a commentAdd a comment