సాక్షి, న్యూఢిల్లీ : ఎండలో, వానలో కాలినడకన వెళ్లేవారికి ఎంతో తోడుగా ఉండేది గొడుగు. ఎండలో చెమట పడుతున్న చేతులతో, ఈదురు గాలులతో వర్షంలో గొడుగును పట్టుకోవడం ఇబ్బందే. అస్తమానం చేతిలో సెల్‌ఫోన్ పట్టుకొని తిరిగే నేటి రోజుల్లో ఓ చేతిలో సెల్, మరో చేతిలో గొడుగు పట్టుకోవడం కష్టం. ఈ కష్టాలన్నింటి దూరం చేస్తూ మనం ఎటు వెళితే అటు మన తలవెంట దానంతట అదే గాలిలో నడిచి వచ్చే గొడుగు పట్టే గొడుగును తయారు చేసిందీ ఓ జపాన్ కంపెనీ.
ఇందులో తలను ఫొలో అయ్యేందుకు ఓ కెమెరాను, దానంతట అదే గాల్లో తేలియాడుతూ రావడానికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినట్లు అసాయి పవర్ సర్వీసెస్ వెల్లడించింది. అటానమస్ డ్రోన్‌లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఓ ప్రోటోటైప్ గొడుగును తయారు చేశామని, దీని బరువు 11 పౌండ్లుకాగా, ఒకసారి బ్యాటరీ చార్జిచేస్తే పనిచేసే సమయం అరగంటని కంపెనీ యాజమాన్యం తెలిపింది. గొడుగును రెండు పొండ్లకు తగ్గించి బ్యాటరీ గంటసేపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, 2019లో 275 డాలర్లకు ఈ గొడుగును మార్కెట్‌లోకి విడుదల చేస్తామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment