- లోక్‌సత్తా తెలుగు రాష్ట్రాల కన్వీనర్ రామ్మోహనరావు
ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి
Published Tue, Aug 2 2016 12:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
పరకాల : ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ బండారు రామ్మోహనరావు అన్నారు. వీఆర్వో వొల్లాల రమేష్‌బాబు ఉద్యోగ విరమణ సభ ఆదివారం రాత్రి పట్టణంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో తహసీల్దార్ పి. హరికృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించే అన్ని సంస్థలను ఒకచోటికి చేర్చాలన్నారు. రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రభుత్వమని, ప్రభుత్వానికి ప్రతిరూపంగా కన్పించే రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులు రావాలన్నారు. సాదాబైనామా సక్రమంగా చేయడం సబబేనన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, చైర్మన్ రాజభద్రయ్య, వైస్ చైర్మన్ దేవునూరి రమ్యకృష్ణమేఘనాథ్, కౌన్సిలర్లు ఆర్‌పీ జయంత్‌లాల్, మడికొండ సంపత్‌కుమార్, పాడి నవ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు గంట విజయసమ్మిరెడ్డి, వీఆర్వోలు ముసినిపల్లి రమేష్, జనుప మోహన్, ఎల్‌ఐసీ డీవో కోసరి రజనీకుమార్, కామిడి సతీష్‌రెడ్డి, కాటూరి శ్రీధరాచార్య, సుధాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement