
చెట్లకే గొడుగు!
టోక్యో: ఎండ, వాన నుంచి మనల్ని కాపాడే చెట్ల రక్షణకు మనం ఏం చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్లుగా కొట్టేయడం తప్ప కాపాడడమా? కాని జపాన్‌లో జనం అలా కాదు. వారు చెట్లను కాపాడేందుకు ఇలా గొడుగులు తయారు చేస్తున్నారు. చలికాలంలో పడే మంచు గడ్డల బారి నుంచి చెట్ల కొమ్మలు విరిగిపడకుండా చూసేందుకు ఇలా ఏర్పాట్లు చేశారు. వెదురు కర్రను మధ్యలో అమర్చి చుట్టూ తాళ్లతో ఇలా గొడుగు మాదిరిగా తయారు చేసి చెట్లపై అమర్చుతారట. ఒక్క చెట్టుకు గొడుగు తయారు చేసేందుకు దాదాపు 800 తాళ్లు అవసరమవుతాయట.