మర్రి, వేపతో వాయు కాలుష్యానికి చెక్
గాలిలోని దుమ్మునుఒడిసిపట్టుకోగలసామర్థ్యం ఉన్నట్లు గుర్తింపు
ధూళిని తట్టుకొనిఎదగగలవని నిర్ధారణ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోడైవర్సిటీ పరిశోధనలో వెల్లడి
పారిశ్రామిక ప్రాంతాలు, హైవేలపై అవెన్యూ ప్లాంటేషన్లుగా వాటిని వాడాలని సూచన
హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ దీనికి ఓ విరుగుడును గుర్తించింది. దుమ్ము, వాయు కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించడంలో కొన్ని జాతుల వృక్షాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనలో తేల్చింది. ముఖ్యంగా మర్రి జాతి చెట్లు అత్యంత సమర్థంగా వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయని.. వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు సైతం కాలుష్య స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నిర్ధారించింది.
ఈ జాతుల చెట్లు దుమ్మును ఒడిసిపట్టుకోగలవని, గాలిలోని ధూళిని తట్టుకొని ఎదగగలవని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ పరిశోధన వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనను పంకజ్ సింగ్ (సైంటిస్ట్–డీ – పరిశోధన బృంద సమన్వయకర్త), భారతీ పటేల్ (సైంటిస్ట్–డీ – అటవీ జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు) నిర్వహించారు.
జీవరసాయననమూనాలతో..
ఈ పరిశోధన కోసంహైదరాబాద్ శివార్లలో అధిక కాలుష్యం వెలువరించే పరిశ్రమలున్న దూలపల్లి, బొల్లారంపారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం, మేడ్చల్ హైవే వెంబడి ఉన్న తుక్కుగూడ ప్రాంతంలోని పలు చెట్ల జాతుల నుంచి జీవరసాయన నమూనాలను సేకరించారు. ఆయా నమూనాలనువిశ్లేషించగా వాటిలో మర్రి, వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు వాయు కాలుష్య నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
గ్రీన్‌బెల్ట్ విస్తరణకు దోహదం
పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ప్రధాన హైవేల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్లుగా ఈ జాతుల మొక్కలను నాటడం ద్వారా సత్ఫలితాలను పొందొచ్చని సూచించారు. నగరంలో గ్రీన్ బెల్ట్ విస్తరణకు, వాయుకాలుష్యం నియంత్రణతోపాటు వడగాడ్పుల ప్రభావం తగ్గించేందుకు, మట్టి, శబ్ద, నీటి కాలుష్యం నివారణకు సైతం ఈ వృక్షాలు దోహదపడతాయనిపేర్కొన్నారు.
వాయు కాలుష్య తీవ్రతను సూచించే వరగోగు
వివిధ ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రతను తెలియజేయడంలో వరగోగు (సొగసుల చెట్టు) జాతి చెట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. పారిశ్రామిక వ్యర్థాలు అధికంగా ఉండే చోట లేదా భారీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఈ చెట్ల ఆకులు రంగుమారడం, మాడిపోవడం కనిపిస్తుందనిపరిశోధకులు పేర్కొన్నారు.
- సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment