Pak PM Shehbaz Sharif Trolled After Video Shows Him Snatching Umbrella From Woman Officer, Video Viral - Sakshi
Sakshi News home page

ప్యారిస్ వేదికగా పాక్‌ ప్రధాని అనుచిత ప్రవర్తన.. మహిళ దగ్గర గొడుగు లాక్కుని..

Published Fri, Jun 23 2023 6:38 PM | Last Updated on Fri, Jun 23 2023 7:45 PM

Pak PM Trolled After Video Shows Him Snatching Umbrella From Woman Officer - Sakshi

ప్యారిస్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ అనుచితంగా ప్రవర్తించారు. సమావేశానికి హాజరవ్వడానికి వెళ్లిన క్రమంలో ఆహ్వనానికి వచ్చిన మహిళ అధికారి వద్ద గొడుగు లాక్కున్నారు. పాపం.. వర్షం కారణంగా గొడుగు పట్టడానికి వచ్చిన ఆ మహిళ ఉద్యోగిని తడుస్తూనే ప్రధాని వెంట నడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సమావేశ భవనాన్ని చేరడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కారు దిగారు. వర్షం కారణంగా ఆయనకు గొడుగు పట్టడానికి కారు డోర్‌ దగ్గరే ఓ మహిళ అధికారి రెడీగా ఉంది. ప్రధాని కారు దిగగానే తడవకుండా గొడుగు పట్టింది. అయితే.. ఆయన ఆ గొడుగును ఆమె నుంచి తీసుకునే ప్రయత్నం చేయగా.. అసౌకర్యం కలగకుండా తానే పడతానన్నట్లుగా గొడుగును ఎత్తే ప్రయత్నం చేసింది. కానీ షెహబాజ్ షరీఫ్ ఆమె నుంచి గొడుగును లాక్కున్నారు. తానే గొడుగు పట్టుకుని సమావేశ భవనానికి వెళ్లారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ ఉద్యోగిని అధ్యక్షుడి వెంటే వర్షంలో తడుస్తూ నడిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్రధాని అనుచిత ప్రవర్తనపై పాక్‌ సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళను వర్షంలోనే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రధాని ఎలా అయ్యారని నెట్టింట విమర్శల వర్షం కురిపించారు. 

ఇదీ చదవండి: యుద్ధానికి సై అంటారు, మమ్మల్ని పట్టించుకోరు.. ఆదుకోండి ప్లీజ్‌!: పాక్‌ ప్రధాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement