కళ్లద్దాలు, టోపీ చేతిలో మంచినీళ్ల బాటిళ్లతో ట్రాఫిక్ సిబ్బంది
ఒంగోలు క్రైం: వేసవిలో కూల్..కూల్‌గా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తించేందుకు ఎస్పీ బి.సత్య ఏసుబాబు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఒంగోలు నగరంలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవిని తట్టుకొని విసుగులేకుండా విధులు నిర్వర్తించేందుకు కొన్ని వసతులు కల్పించారు. ఈ సందర్భంగా తలపై వేసవిని కూడా తట్టుకునే టోపీ, కళ్లకు కూలింగ్ అద్దాలు, మంచినీరు చల్లగా ఉండేవిధంగా చేసే అధునాతన వాటర్ బాటిళ్లు అందించారు. ఈ సందర్భంగా ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం ట్రాఫిక్ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు సిబ్బందికి చేసిన ఏర్పాట్ల గురించి ట్రాఫిక్ సిఐ కెవి.రాఘవేంద్ర వివరించారు. కార్యక్రమంలో ఎస్సై డి.రంగనా«థ్, కె.హనుమంతరావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment