చదువుకోమంటూ తల్లి మందలించటంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
Published Fri, Jan 22 2016 9:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మార్కాపురం: చదువుకోమంటూ తల్లి మందలించటంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పదో వార్డుకు చెందిన ఉత్తరాది సౌభాగ్యవతి ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతోంది.
టైం వేస్ట్ చేయవద్దని, చదువుకోవాలని గురువారం రాత్రి ఆమెను తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సౌభాగ్యవతి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో అర్థరాత్రి ఇంటి పైనుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది.
Advertisement
Advertisement