మార్కాపురం : ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో రెండు భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీపావళీ తారాజువ్వలు ఎగసిపడి గుడి గోపురానికే ఎసరు తెచ్చాయి. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలోని గాలిగోపురంకు మరమ్మత్తులు చేస్తున్నారు. గోపురం పై భాగాన్ని ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచారు. నిన్న రాత్రి రయ్యుమంటూ ఓ తారాజువ్వు దూసుకొచ్చి గోపురం పై పడింది. గోపురం పై ఉన్న ప్లాస్టిక్ కవర్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
మరోవైపు పట్టణంలోని నాయుడువీధిలోని రేణుక హోంనీడ్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుకాణంలో వస్తువులు కాలి బూడిద అయ్యాయి. సుమారు రూ. 50 లక్షల విలువైన వస్తులు అగ్నికి ఆహుతి అయినట్లు సమచారం.
మర్కాపురంలో రెండు భారీ అగ్నిప్రమాదాలు
Published Mon, Nov 4 2013 10:07 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement