మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునరెడ్డి
సాక్షి, పొదిలి: వైఎస్ జగన్‌మోహనరెడ్డి అమలు చేయాలని నిర్ణయించిన నవరత్నాల పథకాలతో పేదల, రైతుల, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరతాయని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అన్నవరం, చింతగుంపల్లి, ఆముదాలపల్లి, రాములవీడు, నిమ్మవరం, బుచ్చనపాలెం, కొత్తపాలెం, మల్లవరం, కొష్టాలపల్లి, అక్కచెరువు, జువ్వలేరు గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల కూడళ్లలో జరిగిన సభల్లో నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పొదిలి మండలానికి వెలుగొండ ప్రాజెక్ట్ పరిధి పెంచేలా జగన్‌మోహనరెడ్డి సీఎం అయినే వెంటనే ప్రతిపాదనలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మె ల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, మాజీ మండల శాఖ అధ్యక్షుడు జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మహాబూబ్‌బాష, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ వాకా వెంకటరెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కొత్తపులి బ్రహ్మారెడ్డి, పులి చంద్రశేఖరరెడ్డి, పులి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పొన్నపాటి శ్రీనివాసులరెడ్డి, చాగంరెడ్డి మాలకొండారెడ్డి, యేబు, యేటి నారాయణ, డి.శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వై.వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీటీసీ కె.వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు సీహెచ్.వెంకటేశ్వరరెడ్డి, గొంటు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రచారం
పట్టణంలోని 1,2,3 వార్డులలో మాజీ ఎంపీపీ ఉడుముల నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యుడు గౌసియా, నాయబ, దోర్నాల వరలక్ష్మమ్మ, గొలమారి నాగమణి, శ్రావణి, చిమట ఖాశీం, రాములేటి ఖాదరున్నీసా, రాములేటి మస్తాన్‌వలి పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల్లో ప్రచారం..
మార్కాపురం: వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ చిర్లం చర్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలోని వివేకానంద స్కూల్, సత్యనారాయణస్వామి గుడి, రెడ్డి కళాశాల, 10వ వార్డు, శ్రావణి హాస్పిటల్ ఏరియా, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు బొగ్గరపు శేషయ్య, ఊటుకూరి రామకృష్ణ, కె.కృష్ణ, ఆర్.తిరునారాయణ, ఆర్.రమేష్, సీహెచ్ నాగరాజు, కాళ్ల ఆది, సీహెచ్ రమేష్, ఇమ్మడిశెట్టి వీరారావు పాల్గొన్నారు.
కేపీ కుటుంబ సభ్యుల ప్రచారం
పట్టణ శివార్లలోని పూలసుబ్బయ్య కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో కుందురు నాగార్జునరెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరు తూ కౌన్సిలర్ బుశ్శెట్టి నాగేశ్వరరావు, రావి శివారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. కేపీ కుటుంబ సభ్యులైన అరుణ, కల్పన, పద్మావతి, బూత్ కన్వీనర్ ఎస్.రవి కుమార్, మాజీ కౌన్సిలర్ డి.కాశింపీరా, డి.మార్క్, కాశయ్య, నాగరాజు, నారాయణ పాల్గొన్నారు.
తర్లుపాడులో..
తర్లుపాడు: రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునరెడ్డి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేపీ కొండారెడ్డి కుమార్తె అరుణ కోరారు. మండలంలోని మీర్జాపేట పంచాయతీ పరిధిలోని కారుమానుపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి, చిన్న కొండారెడ్డి, సరస్వతి, లక్ష్మి, డి.భాస్కరరెడ్డి, ఎర్రారెడ్డి, గాదె శ్రీనివాసరెడ్డి, వెన్నా శివారెడ్డి, తాతిరెడ్డి మల్లారెడ్డి, గాలిరెడ్డి, దొండపాటి వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనకనమిట్ల: మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ఉడుముల నారాయణమ్మ, మాజీ సర్పంచ్ ఉడుముల గురవారెడ్డి, మోరా శంకరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గొట్లగట్టు, నాయుడుపేట, తువ్వపాడు, చౌటపల్లి గ్రామాల్లో నాగార్జునరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం కోసం, జగనన్న ముఖ్యమంత్రిగా రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపంచాలని ఆయా గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మండల పార్టి ఉపాధ్యక్షుడు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మోరా శంకరరెడ్డి, నాయకులు ఎం.రంగస్వామి, కల్లం సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment