Nagarjuna Reddy
-
ఓటమిపై నాగార్జున రెడ్డి రియాక్షన్
-
జూన్ నుంచి కర్నూలులోనే ‘ఏపీఈఆర్సీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీఈఆర్సీని అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఆ తర్వాత విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఈ భవనం జూన్ నెలకల్లా అందుబాటులోకి వస్తుండటంతో ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించేందుకు ఫైళ్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించింది. వారి ఫోన్ నంబర్లను కూడా సిబ్బందికి ఇచి్చంది. మూడు ప్రాంతాల్లోనూ మండలి పని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం ఉంది. అంతకు ముందు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల, బహిరంగ విచారణ వంటివి నిర్వహించేవారు. ఇటీవల 2024–25 ఏడాదికి టారిఫ్ ఆర్డర్‌ను విజయవాడలో ఏపీఈఆర్సీ విడుదల చేసింది. ఈ విధంగా మూడు ప్రాంతాల్లోనూ మండలి విస్తరిస్తోంది. -
మీర్జా పేటలో సచివాలయం, హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
-
విద్యుత్ చార్జీల పెంపుపై విశాఖలో ప్రజాభిప్రాయ సేకరణ
-
చేతల్లో చూపిన ఏకైక ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పేదవర్గాలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు పలు సంక్షేమ పథకాలు, సంస్కరణలు చేపడుతూ వారి గుండె చప్పుడయ్యారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. సీఎం జగన్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విధానాలను అనుసరిస్తూ పేదల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అధ్యక్షతన మార్కాపురం పట్టణంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభలో మంత్రి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సమాజంలో గౌరవం కల్పించిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు. ఈ వర్గాలకు సర్పంచ్ నుంచి డిప్యూటీ సీఎం వరకూ పదవులు ఇవ్వడంతోపాటు ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన దేశంలో ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. చంద్రబాబు దళిత, బీసీల వ్యతిరేకి అని చెప్పారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? హైకోర్టు జడ్జిలుగా బీసీలు వద్దంటూ మాట్లాడిన వ్యక్తి అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సామాజిక న్యాయాన్ని నెలకొల్పారని తెలిపారు. ఎటువంటి సిఫార్సులు, లంచాలు లేకుండానే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మంచి స్కూళ్లు, నాణ్యమైన విద్య, ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు సహా అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ వర్గాలు సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సామాజిక న్యాయం పేరు చెప్పి ఈ వర్గాలను చంద్రబాబు మోసం చేస్తే.., వైఎస్ జగన్ వారిని గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. మార్కాపురానికి మెడికల్ కాలేజీ ఓ వరమని అన్నారు. డిసెంబరు నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అశేష జన వాహిని మొత్తం జగనన్న సైనికులని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా ప్రతి ఇంట్లో జగన్ ఫొటో ఉందన్నారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తూ, వారికి అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన, పుస్తకాలు, బూట్లు, బ్యాగులు ఇస్తున్నారన్నారు. ముస్లింలపై రాజద్రోహం కేసు పెట్టిన చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. నేడు పేద వర్గాల్లో ఇంటికో ఇంజినీర్, డాక్టర్ ఉన్నారంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించి పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని, సీఎం జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించారని తెలిపారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఎస్సీలకు కరెంటు సౌకర్యం కల్పించారని చెప్పారు. రూ.1700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే దానిని పూర్తిచేసే బాధ్యత ఆయన కుమారుడు వైఎస్ జగన్ తీసుకున్నారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రూ.1,700 కోట్లు మంజూరు చేశారన్నారు. పొదిలి పెద్దచెరువు, మార్కాపురానికి సాగర్ నీటి పైపులైన్ల కోసం, చెన్నకేశవస్వామి నాలుగు గోపురాలకు రూ.3 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల పిచ్చయ్య, లిడ్‌క్యాప్ చైర్మన్ కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం
రాజకీయపార్టీల్లో సైద్ధాంతిక ఆచరణ విధానం లోపించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంటున్నారు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి. చట్టాల్లోని నిర్దేశిత సూత్రాలు వాస్తవ రాజకీయ ముఖచిత్రంలో కనిపించడం లేదని, ఎన్నికల్లో డబ్బు ఎరచూపి, పౌరుల హక్కులపై పార్టీలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలిచ్చే పోటీ వాగ్దానాలు వేలం పాటలను తలపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సంక్షేమం పేదవాడి అభ్యున్నతికి వెన్నుపూసలాంటిదని చెప్పారు. మితిమిరిన హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తాయన్నారు. హామీల చక్రబంధంలో ఇరుక్కున్న ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం ఆయనది. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టిన అనుభవం ఆయన సొంతం. ఎన్నికల వేళ ‘సాక్షి’తో ఆయన అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే... ఆ సిద్ధాంతాలేవి? అన్ని పార్టీల సిద్ధాంతాలు ఘనంగా ఉంటాయి. కానీ, అవన్నీ నేతల ఆచరణలో కనిపించకపోవడం విడ్డూరం. ఎన్నికల వ్యయాన్నే తీసుకోండి. దీనికి పరిమితి ఉంది కదా? ఏ పార్టీ నాయకుడైనా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు చేస్తున్నారా? లేనే లేదు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అలా చెయ్యకపోతే గెలవలేరు. అసలీ విషయంపై ఎవరూ మాట్లాడరేం? చట్ట విరుద్ధమని తెలిసినా మౌనంగా ఉంటారేం? తమ ఆకాంక్షలకు తగ్గవారిని ఎన్నుకోవడం ప్రజల హక్కు. ఈ హక్కును డబ్బుతో ముడిపెడుతున్నారు. ఇది రానురాను దిగజారుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో నాయకుడు చెప్పినంత ఇవ్వలేదని ఓ గ్రామంలో ప్రజలు ధర్నా చేశారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి కాదంటారా? ప్రజల నైతికతను డబ్బు అనైతికంగా కొనేస్తోందనడానికి ఇదే సాక్ష్యం. ఈ విషయంలో ప్రజలు జాగృతం కావాలి. డబ్బులకు ప్రలోభ పడొద్దు. ఓటును బలమైన ఆయుధంగానే భావించాలి. వేలం వెర్రి హామీలు అన్ని పార్టీలూ పోటీపడి హామీలిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వేలం వెర్రిగా గుప్పిస్తున్నాయి. ఇది ఓ రకంగా ప్రజలను మోసం చేయడమే. అలవి కాని హామీలు ఎలా నెరవేరుస్తారు? గెలవడమే పార్టీలకు గీటురాయిగా మారింది. పార్టీల మేనిఫెస్టోకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. అందుకే ఇచ్చే హామీలు ఒకలా ఉంటాయి. అమలు వేరోలా ఉంటాయి. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలకు సవాలక్ష షరతులు పెడతారు. లబ్దిపొందే వారి సంఖ్యను భారీగా కుదిస్తారు. దీన్ని మోసం కాదంటారా? 20 ఏళ్లక్రితం ఇలాంటి పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడే విపరీతమైన పరిస్థితి. హామీలివ్వడం నేతలకు అలవాటైంది. వాటికోసం ఎదురుచూడటం ఓటర్లకు రివాజు అయ్యింది. అంతిమంగా ప్రజలు హామీల చక్రబంధంలో ఇరుక్కుంటున్నారు. మితిమీరిన హామీలిస్తే ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతింటుందనేది ఆలోచించడం లేదు. మోసపూరిత హామీలను నమ్మొద్దు. పవర్ పాలిటిక్స్ మంచిది కాదు.. విద్యుత్ అంశం రాజకీయ ఆయుధమైంది. ఈ విషయంలో అన్ని పార్టీలూ పోటీ పడుతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేకు ప్రయత్నిస్తున్నాయి. జనం వాస్తవాలు తెలుసుకునే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ నేరం ముమ్మాటికీ రాజకీయ పార్టీలదే. 1969లో పరిశ్రమలకు యూనిట్‌కు 10 పైసల విద్యుత్ ఉండేది. కానీ వ్యవసాయానికి 11 పైసలుండేది. ఉచిత విద్యుత్ తెచ్చింది దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు అన్ని పార్టీలూ వ్యవసాయ విద్యుత్‌ను రాజకీయ అస్త్రం చేసుకుంటున్నాయి. ఇవ్వొచ్చు. తప్పులేదు. విద్యుత్ చట్టం ప్రకారం వాడే విద్యుత్‌ను లెక్కగట్టాలి. ఈ పని జరగకుండా నేతలు రాజకీయం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యత్‌ను డిస్కమ్‌లకు ప్రభుత్వాలు ముందే చెల్లించాలి. అప్పుడే డిస్కమ్‌లు ఆర్థికంగా బాగుంటాయి. దీన్ని పక్కనబెడుతున్నారు. మీటర్లు.. మోటర్ల రాజకీయంతో ప్రజలను కరెంట్ వాస్తవాలు తెలియకుండా పక్కదారి పట్టిస్తున్నారు. మీటర్లు పెడితే తమ ఉచిత హక్కు హరించేస్తారనే భయం కల్పిస్తున్నారు. ఈ పాలిటిక్స్ మంచిది కానేకాదు. యువతకు ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇక కలే. దీన్ని యువత గుర్తించేలా అన్ని పార్టీలు అవగాహన కల్పించాలి. ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనలోనూ మెరుగ్గా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు పెంచాలి. పరిశ్రమలు విస్తరించేలా చూడాలి. అన్నింటికన్నా ముందు విద్యావ్యవస్థలో మార్పు తేవాలి. పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే నైపుణ్యం అవసరం. ఇది విద్యార్థి దశ నుంచే జరగాలి. చదువుకునేటప్పుడే ఏదో ఒక నైపుణ్యం కల్పించాలి. అమెరికాలోనైతే విద్యార్థి ఆసక్తిని గుర్తిస్తారు. అందులో మొదట్నుంచీ శిక్షణ ఇస్తారు. పార్టీలకతీతంగా యువతలో ‘సైంటిఫిక్ టెంపర్మెంట్’ తీసుకురావాలి. ఇందులో విజయవంతమయ్యే ప్రభుత్వాలే యువతను తమ వెంట ఉంచుకోగలవు. ఓటు ప్రతి ఒక్కరి ఆయుధం. సమాజానికి పనికొచ్చే వారిని గుర్తించి మరీ ఓటు వేయాలి. అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. -వనం దుర్గాప్రసాద్ -
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెండు ప్రశ్నలు
-
ప్రజా మద్దతు.. సీఎం జగన్ కే
-
మహాయజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్ళలో రూ.45 వేల ఆర్థికసాయం
-
విద్యుత్ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వినియోగదారులపై ఈసారి ఎలాంటి విద్యుత్ భారం పడలేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఛార్జీలు మినహా ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీఈఆర్సీ నిర్ణయించిన ఆదాయ అంతరం మొత్తంలో రూ.10,135 కోట్లను సబ్సిడీ రూపంలో డిస్కంలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది చాలా సంతోషకరమన్నారు. నగరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకుర్ రామ్‌సింగ్, ఎ.రాజగోపాల్‌రెడ్డిలతో కలిసి విద్యుత్ టారిఫ్ చార్జీలను నాగార్జునరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్ క్రమబద్ధీకరణకు సబ్సిడీ.. ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగింపుతో పాటు ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు, ఆక్వా రైతుల వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులకు టారిఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.52,590.70 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాలను ఏపీఈఆర్‌సీకీ సమర్పించాయని.. అందులో రూ.49,267.36 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు. విద్యుత్ అమ్మకాలు, కొనుగోలు అవసరాలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు విద్యుత్ పంపిణీ సంస్థల అంచనాల కంటే తక్కువగా వుండడంతో ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత పరిశ్రమ, పిండిమిల్లులకు ఊరట ఇక పవర్లూమ్ వినియోగదారులకు కేవీఏహెచ్ (కిలోవోల్ట్ యాంపియర్ అవర్స్) బిల్లింగ్ మినహాయింపు ఇచ్చినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్ వినియోగదారుల అభ్యర్థనల మేరకు 10 హెచ్‌పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్‌ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, గతేడాదిలో ఒక్కసారే వున్న ఆఫ్–సీజన్ ఎంపికను ఈ ఏడాదికి రెండుసార్లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్‌లో హెచ్‌టీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ డిమాండ్ చార్జీలను వసూలుచేయడం లేదన్నారు. ఈ ఏడాదిలో రూ.475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. సోలార్ రైతులకు సమస్యలొస్తే.. ఉచిత విద్యుత్ సోలార్ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్ విద్యుత్ వినియోగంలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేయాలని ఆదేశించినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. అంతేకాక.. సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్ఈడీ, ట్యూబ్‌లైట్లు, బీఎల్డీసీ (బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్) సీలింగ్ ఫ్యాన్లు, సూపర్ ఎఫీషియెంట్ ఎయిర్ కండిషనర్లు వంటి ఇంధన ఉపకరణాల విక్రయాల పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌లో అలసత్వం వహిస్తే చర్యలు రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తే డిస్కమ్ అధికారులపై చర్యలు తప్పవని నాగార్జునరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల సంతృప్తిని సమీక్షించేందుకు జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపీఈఆరీ్సకి సమర్పించాలని ఆదేశించామన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని.. అది చట్టపరిధిలోని అంశమని ఆయన స్పష్టంచేశారు. -
మా అక్కది హత్యే.. నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేయాలి
కొడకండ్ల: తన సోదరి ధరావత్ ప్రీతి మృతిపై పారదర్శకంగా విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రీతి సోదరుడు ధరావత్ వంశీ(పృథ్వీ) డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై జరుగుతున్న విచారణ పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో గురువారం ఆయన మాట్లాడుతూ మా అక్కది హత్య అనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని, గూగుల్‌లో డ్రగ్స్ గురించి సెర్చ్ చేసిందనడానికి ఏం ఆధారాలున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ముగ్గురు డాక్లర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని చెబుతున్నారని ఇది అవాస్తవమని, కౌన్సెలింగ్ చేసినట్లయితే మా అక్క తమతో చెప్పేదని, ఫోన్ ఆధారాలున్నాయని చెప్పారు సైఫ్ మా అక్కకు రెస్ట్‌లెస్ డ్యూటీలు వేయాలని తోటి డాక్టర్లకు చెప్పాడని పేర్కొన్నారు. నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేసి ప్రీతి ఘటనపై పారదర్శకంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు
తిరుపతి రూరల్: వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం 18వ రాష్ట్రస్థాయి సలహామండలి(ఎస్ఏసీ) సమావేశం జరిగింది. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రైతుల నుంచి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లు చెప్పారు. రానున్న 30ఏళ్ల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ‘సెకీ’ ద్వారా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించామని, రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల నుంచి వినియోగదారులు తమ సూచనలు, సలహాలను తెలియజేశారని వివరించారు. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిరంతరం సలహాలు, సూచనల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఏడాదికి ఒకసారి టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎవరైనా వినియోగదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడాదిలో ఎప్పుడైనా అందించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. 365 రోజులు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్), టారిఫ్‌లపై ఆన్లైన్ ద్వారా ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిపై సమీక్షించేందుకు నిర్వహించిన స్టేట్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. -
కుటుంబంతో కలిసి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి భోగి సంబరాలు
-
వాయిదాల్లో విద్యుత్ ఆదా పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వృథాను అరికట్టి, వినియోగదారులకు బిల్లులు తగ్గించడంలో తోడ్పడడంతో పాటు ప్రజలకు, పర్యావరణానికి మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ రంగం అడుగులు వేస్తున్నాయి. తాజాగా విద్యుత్ పొదుపు కోసం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నడుం బిగించింది. విదేశాల్లో విజయవంతమైన ‘ఆన్ బిల్ ఫైనాన్సింగ్’ విధానాన్ని రాష్ట్రానికి సరిపడేలా రూపొందించాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)ను ఏపీఈఆర్సీ బుధవారం ఆదేశించింది. ఈ మోడల్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అందజేసే మార్గాలపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. దీనిపై మూడు వారాలలోపు అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది. ఉత్పత్తి చేయలేకపోయినా ఆదా చేయగలం.. రాష్ట్రంలో విద్యుత్ రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈఆర్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడారు. ఒకరు ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయినా, ఒక యూనిట్ పొదుపు చేయగలరని, ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టేనని నాగార్జునరెడ్డి వివరించారు. వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందజేయడం వల్ల వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుందని, దానికోసం ఏపీఈఆర్సీ, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. వినియోగదారుల ఇష్టం.. ‘ఆన్ బిల్ ఫైనాన్సింగ్’ విధానంలో భాగంగా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్), వస్తు ఉత్పత్తి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వాటి సహకారంతో వినియోగదారులకు ఇంధన సామర్థ్యం కలిగిన ఆధునిక గృహోపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటారు. అలాగే వినియోగదారులు తమ నెల వారీ విద్యుత్ బిల్లుల ద్వారా తాము తీసుకున్న వస్తువులకు తిరిగి చెల్లింపులు చేస్తారు. పరికరాల వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది కాబట్టి బిల్లులు కొంత మేర ఆదా అవుతాయి. ఫలితంగా వినియోగదారులపై వాయిదా భారం అంతగా పడదు. పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి స్మార్ట్ గ్రిడ్లపై పడే అధిక లోడును కొంతమేర నివారించవచ్చని ఏపీఈఆర్సీ వివరించింది. అయితే ఇంధన సామర్థ్య గృహోపకరణాలు ఉపయోగించడం అనేది వినియోగదారులు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఎవరినీ బలవంతం చేయడం జరగదు. అలాగే వారు చెల్లించే వాయిదాలు నేరుగా వస్తు ఉత్పత్తి దారులకు వెళతాయని మండలి స్పష్టం చేసింది. -
ప్రజాప్రయోజనాలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి, డిస్కంల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2015–2019 మధ్య కాలానికి రూ.3,669 కోట్ల సర్దుబాటు చార్జీ (ట్రూ అప్)ల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కంలు ఆర్థికంగా సంక్షోభంలో ఉండటం రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిదికాదని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లోనే సరఫరా చేస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని, ఫలితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తు లక్ష్యాలు, సవాళ్లను సమర్థంగా అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్‌సీతో కలిసి పనిచేయాలని సూచించారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, విద్యుత్తు సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన సర్దుబాటు చార్జీల్లో మూడోవంతును రాష్ట్ర ప్రభుత్వమే (రైతులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలు తదితరుల తరఫున) భరించాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 1.86 కోట్ల మంది వినియోగదారుల్లో దాదాపు 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీతో లబ్ధి పొందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వివిధ వర్గాల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన 1,657 కోట్ల రూపాయలను సెక్షన్ 65 ప్రకారం అర్హులైన 23 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలివ్వడానికి 2021–22 టారిఫ్ ఆర్డర్లో తొలిసారిగా అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్కంల నుంచి విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని తెలిపారు. విద్యుత్ రంగంలో సగటు వినియోగదారుడికి నాణ్యమైన, నమ్మకమైన, మెరుగైన కరెంటు సరఫరా 24 గంటలు అందించడంతోపాటు వారి శ్రేయస్సు, అభివృద్ధి తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. ఇందుకోసం డిస్కంలకు ఆర్థిక సామర్థ్యం , సుస్థిరత అత్యవసరమని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింనట్లు ఆయన తెలిపారు. నేడు సలహా మండలి సమావేశం డిస్కంలను బలోపేతం చేయడంతోపాటు వాటి పనితీరును మెరుగుపరిచి వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీఈఆర్సీ ఇందులో భాగంగా సోమవారం సలహా మండలి సమావేశం నిర్వహిస్తోంది. ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే సగటు ఖర్చు తగ్గించడం, విద్యుత్ కొనుగోళ్లను క్రమబద్ధీకరించడం, డిస్కంల పనితీరును మెరుగుపర్చడం, డిమాండ్ నిర్వహణ–ఇంధన సంరక్షణ–సామర్థ్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు 16 మంది, ఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్రామ్సింగ్, డిస్కంల సీఎండీలు, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. -
పేదోడి కరెంట్ బిల్లు పైసా పెరగదు
సాక్షి, అమరావతి: పేదలు, అల్పాదాయ వర్గాల కరెంట్ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలపై పడే రూ.10,060.63 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.1,707.07 కోట్లను గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందన్నారు. ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఉన్న పరోక్ష విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల కోరిక మేరకు ఎత్తేశామని చెప్పారు. కొత్త టారిఫ్ రూపకల్పనలో కమిషన్ పాత్రపై జస్టిస్ నాగార్జునరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెంచలేదు.. తగ్గేలా చేశాం రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్ బిల్లు (యూనిట్ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్ బిల్లు పెరిగే ప్రసక్తే లేదు. నెలకు 75 యూనిట్లు దాటిన వారి విషయంలో బిల్లు స్వల్పంగా పెరిగినట్టే ఉన్నా.. గతంలోని పరోక్ష విధానాన్ని విశ్లేషించి చూస్తే వారిలో సగం మందికి కరెంట్ బిల్లులు తగ్గే వీలుంది. ఏ విధంగా అంటే.. 100 యూనిట్ల వరకూ పాత బిల్లు ప్రకారం.. (0–50 వరకూ యూనిట్ రూ.1.45... 51–100 వరకూ యూనిట్‌కు రూ.2.60 చొప్పున) నెలకు రూ.202.50 వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. (0–100 వరకూ యూనిట్ రూ.2.60 చొప్పున) రూ.260 బిల్లు వస్తుంది. అంటే.. రూ. 57.50 పెరిగినట్టు కనిపించినా వాస్తవంలో ఇది తగ్గుతుంది. మారిన శ్లాబ్ ప్రకారం ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే కాబట్టి కరెంట్ బిల్లులు తగ్గుతాయి. నెలకు 101–200 యూనిట్లు వాడే వాళ్లు రాష్ట్రంలో 37.28 లక్షల మంది ఉన్నారు. 201–225 యూనిట్లు వాడేవారు 6.28 లక్షల మంది. వీరి వినియోగం తగ్గితే తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. కాబట్టి పేద వర్గాలపై ఎంతమాత్రం భారం పడలేదు. 500 యూనిట్లపైన వాడేవారు 1.35 లక్షల మంది ఉన్నారు. అధిక సంపన్నులైన వీరికి పెరిగింది కేవలం యూనిట్‌కు రూ.90 పైసలే. గత ఐదేళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే ఉచిత కరెంటు, తదితరాలకు డిస్కమ్‌లు భరించే భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వాటికి ఇవ్వాలి. అయితే.. 2015–16లో రూ.3,600 కోట్ల సబ్సిడీకి రూ.3,186 కోట్లు, 2016–17లో రూ.3,951 కోట్లకు రూ.2,923 కోట్లు, 2017–18లో రూ.3,700 కోట్లకు.. రూ.2750 కోట్లు, 2018–19లో రూ.6,030 కోట్లకు రూ.1,250 కోట్లు, 2019–20లో రూ.8,255 కోట్లకు రూ.4,667 కోట్లు మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇతరత్రా పేరుకు పోయి.. అప్పులు చేసిన డిస్కమ్‌లు వడ్డీలకే నెలకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. పరిశ్రమలకు చేయూత.. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వ పథకాల కోసం నాణ్యమైన బియ్యం ఆడించే రైసు మిల్లులకు వినియోగం లోడ్ పరిమితిని వంద నుంచి 150 హెచ్‌పీకి పెంచాం. అనేక పరిశ్రమలకు లోడ్‌ఫ్యాక్టర్ ఇన్సెంటివ్స్ (ఎక్కువ వినియోగానికి రాయితీలు) కొనసాగిస్తున్నాం. ఫెర్రో అల్లాయిస్‌ను బతికించేందుకు 85 శాతం లోడ్ ఫ్యాక్టర్ నిబంధనల ప్రతిపాదనను పక్కనపెట్టాం. కుటీర పరిశ్రమలపై కెపాసిటర్లు లేవని విద్యుత్ సిబ్బంది వేసే జరిమానాలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాం. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు నూతన టారిఫ్ వల్ల భారీ ప్రయోజనం కలుగుతుంది. ఏ లాభాపేక్ష లేని ఈ సంస్థలను వాణిజ్య కేటగిరీలోంచి తీసేశాం. విద్యుత్ సంస్థలను ప్రజలకు చేరువ చేయాలన్న కమిషన్ ఆలోచనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ, గతంలో లేని విధంగా గృహ విద్యుత్ వినియోగ సబ్సిడీ రూ.1,707.07 కోట్లు ఇచ్చింది. దీనికి వ్యవసాయ సబ్సిడీ (రూ.8,353.58 కోట్లు) కలిపితే మొత్తం ఇచ్చింది రూ.10,060.63 కోట్లు. -
వచ్చే ఏడాదికి వెలిగొండ ప్రాజెక్టుకు నీరు
మార్కాపురం: వచ్చే ఏడాదికి వెలిగొండ ప్రాజెక్టు నీరు పశ్చిమ ప్రాంతంలో పారుతుందని, పొలాల్లో పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిలు అన్నారు. సోమవారం రైతు దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లుగా వ్యవసాయం నిర్వీర్యమైందని, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అన్నదాతలు తల ఎత్తుకునేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి ఖర్చుల కింద రూ.12,500 జమ చేస్తారని, కనీస మద్దతు ధరలు కూడా ప్రకటించి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్నదాతల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కొండేపల్లిని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం మండలంలోని కొండేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొండేపల్లి గ్రామంలో విజోత్సవ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మా గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని భరోసా ఇచ్చారు. మా తండ్రి కేపీ కొండారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించడం జరిగిందని, ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా చేయడం మీ కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవల కాలంలో రాజధానిలో కలవడం జరిగిందన్నారు. తొలుత ఈ ప్రాంత వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. అలాగే శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి మార్కాపురం చెరువును సాగర్ వాటర్ నింపడానికి కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి మాట్లాడుతూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కాలంలోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందిందన్నారు. పట్టణంలో ముస్లింలకు షాదీఖానా, హిందువులకు కల్యాణ మండపం, పట్టణంలోని తాగునీటి అవసరాలకు సాగర్ పైపులైన్, ప్రస్తుతం టీడీపీ నాయకులు వేసిన సీసీ రోడ్డులు కూడా ఆయన మంజూరు చేయించిన పనులను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బుశ్శెట్టి నాగేశ్వర రావు, నాగిశెట్టి, యూత్ నాయకులు శివారెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
నేను ఎమ్మెల్యేనైతే..!
సార్వత్రిక ఎన్నికల సమరం సమీపిస్తుంది. ప్రచారపర్వం పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు, వాటి అధినేతలు పోటీపడి ఒకరికి మించి మరొకరు హామీలిచ్చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికివారే తన గెలుపు ఖాయం అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాము ఎమ్మెల్యే అయితే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారో వివరించారు. సాక్షి, మార్కాపురం (ప్రకాశం): ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణమే తన ముందు ఉన్న లక్ష్యమని, జగనన్న సీఎం కాగానే ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయి పశ్చిమ ప్రకాశంలో కరువు శాశ్వతంగా పోతుందని మార్కాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి అంటున్నారు. విద్యాభ్యాసం ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు మాత్రమే మార్కాపురం పట్టణంలోని సెయింట్ ఆన్స్ స్కూల్లో, 5నుంచి 10వ తరగతి వరకు నంద్యాల పబ్లిక్ స్కూల్లో, ఇంటర్మీడియేట్ గుంటూరు వికాస్‌లో, ఇంజినీరింగ్ కర్నాటకలోని షిమోగా యూనివర్శిటీలో, ఎం.ఎస్ అమెరికాలోని టెక్సాస్‌లో పూర్తి చేశాను. మాచర్లలో న్యూటన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో డైరెక్టర్‌గా ఉన్నాను. సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రాజకీయ నేపథ్యం? నేను పుట్టక ముందే నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. ఇంటి నిండా ఎప్పుడు అధికారులు, ప్రజలు, కార్యకర్తలతో సందడిగా ఉండేది. ఆ ప్రభావం నా మీద పడకూడదని, నా విద్యభ్యాసం మొత్తం బయటే గడిచింది. మామ ఉడుముల శ్రీనివాసులరెడ్డి కూడా కంభం మాజీ ఎమ్మెల్యే. ఇటు పుట్టింట్లో, అటు మామ వారింట్లో రాజకీయం ఉండటంతో ప్రజా సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించడం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తూ కష్టాలు పడటం, కుట్రలు, కుతంత్రాలకు ఇబ్బంది పడటం చూశాను. ఏడాదిన్నర పాటు ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు 3,648 కి.మీ పాదయాత్ర చేయడం, తదితర అంశాలతో రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. నా రాజకీయ గురువు తండ్రి అయిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి జిల్లాలో సీనియర్ వైఎస్సార్ సీపీ నేతగా గుర్తింపు పొందిన కేపీ కొండారెడ్డి సూచనలతో మార్కాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. రాజకీయాల్లో గురువు మానాన్న కొండారెడ్డే నాకు రోల్‌మోడల్, గురువు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని ఏ గ్రామంలోకి వెళ్లినా, ఎమ్మెల్యేగా నాన్న చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తాయి. కొండారెడ్డి కొడుకుగా నన్ను ప్రత్యేకంగా గుర్తించటం, గౌరవించటం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇచ్చిన మాట తప్పకుండా ప్రజల కోసం ఎన్నో క ష్టాలు పడిన జగనన్న పట్టుదల నాకు స్ఫూర్తినిచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఏదో అసంతృప్తి. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేస్తున్న నాన్న నాకు ఆదర్శం. నియోజకవర్గంలోని అధికారులు, ప్రజలు ఇంటికి వచ్చి నాన్న కొండారెడ్డితో మీ వల్ల మాకు ఈ మేలు జరిగిందని చెబుతుంటే ఆయన సంతోషపడేవారు. ప్రజాసేవ చేస్తే ఇంతటి ఆనందం వస్తుందా అని నాకు అనిపించింది. నాన్నతో రాజకీయాలు మాట్లాడాలంటే భయం. ఈ నేపథ్యంలో అప్పటి కంభం ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి కుమార్తె కల్పనతో వివాహమైంది. వారిది కూడా రాజకీయ కుటుంబమే. వాళ్ల తాత ఉడుముల వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో మా తమ్ముడు కృష్ణమోహన్‌రెడ్డి 2009నుంచి2014వరకు మార్కాపురం మండల ఉపాధ్యక్షుడిగా పని చేశారు. రాజకీయాల్లో ఎలా నెగ్గు కొస్తారు? నాన్న కొండారెడ్డి 1985, 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రతి గ్రామంలో ఆయన ఏదో ఒక అభివృద్ధి పని చేశారు. ప్రజలు ఇప్పటికీ మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పెద్దాయనగా గౌరవిస్తారు. జగనన్న నిజాయితీ, మడమ తిప్పని నైజం. ఆయన సీఎం అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడనే ప్రజల నమ్మకం నా గెలుపుకు దోహదపడతాయి. జగనన్న, వైఎ స్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. వారితో పాటు మాకు ప్రజల ఆశీస్సులు లభిస్తాయన్న నమ్మకం ఉంది. ఆశయం జగనన్న సీఎం అయితే ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయించి ఈ ప్రాంతంలో శాశ్వతంగా కరువు తీర్చాలన్నదే నా ఆశయం. 2004లో మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించారు. వైఎస్సార్ ప్రమాదంలో చనిపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేళ్ల నుంచి ఆశతో వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ ప్రాజెక్టు పూర్తయి మార్కాపురం ప్రాంతం సస్య శ్యామలమవుతుంది. ఉగాది పండుగ రోజు విడుదల చేసిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగనన్న హామీ ఇచ్చారు. హామీకి కట్టుబడి కచ్చితంగా పూర్తి చేస్తారు. తాను ఎమ్మెల్యే కాగానే మార్కాపురం నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యను జగనన్న సహకారంతో పరిష్కరిస్తా. పొదిలి పెద్ద చెరువు ఎస్ఎస్ ట్యాంక్‌గా మార్పించి అక్కడ కూడా నీటి సమస్య పరిష్కరిస్తా. మీరు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. సమస్యలు పరిష్కరిస్తా మార్కాపురం ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. టీడీపీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. ఈ అంశంపై రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రజలు భావించారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. మార్కాపురం ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే ప్రజలు, కూలీలు ఉపాధి పని చేసుకునేందుకు కృషి చేస్తాను. – ఇమ్మడి కాశీనాథ్ , జనసేన అభ్యర్థి నీటి సమస్యకు పరిష్కారం బీజేపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి మార్కాపురం ప్రజల నీటి సమస్యను పరిష్కరిస్తాం. మార్కాపురం చెరువులో రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణం చేపట్టి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. - ఎం.చిన్నయ్య, బీజేపీ అభ్యర్థి నియోజకవర్గ అభివృద్ధికి కృషి మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను. టీడీపీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నిర్లక్ష్యానికి గురైంది. అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. - షేక్ సైదా, కాంగ్రెస్ అభ్యర్థి -
నవరత్నాలతో కష్టాలు తీరతాయి
సాక్షి, పొదిలి: వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేయాలని నిర్ణయించిన నవరత్నాల పథకాలతో పేదల, రైతుల, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరతాయని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అన్నవరం, చింతగుంపల్లి, ఆముదాలపల్లి, రాములవీడు, నిమ్మవరం, బుచ్చనపాలెం, కొత్తపాలెం, మల్లవరం, కొష్టాలపల్లి, అక్కచెరువు, జువ్వలేరు గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల కూడళ్లలో జరిగిన సభల్లో నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పొదిలి మండలానికి వెలుగొండ ప్రాజెక్ట్ పరిధి పెంచేలా జగన్మోహనరెడ్డి సీఎం అయినే వెంటనే ప్రతిపాదనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మె ల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, మాజీ మండల శాఖ అధ్యక్షుడు జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మహాబూబ్బాష, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ వాకా వెంకటరెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కొత్తపులి బ్రహ్మారెడ్డి, పులి చంద్రశేఖరరెడ్డి, పులి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పొన్నపాటి శ్రీనివాసులరెడ్డి, చాగంరెడ్డి మాలకొండారెడ్డి, యేబు, యేటి నారాయణ, డి.శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వై.వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీటీసీ కె.వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు సీహెచ్.వెంకటేశ్వరరెడ్డి, గొంటు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రచారం పట్టణంలోని 1,2,3 వార్డులలో మాజీ ఎంపీపీ ఉడుముల నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యుడు గౌసియా, నాయబ, దోర్నాల వరలక్ష్మమ్మ, గొలమారి నాగమణి, శ్రావణి, చిమట ఖాశీం, రాములేటి ఖాదరున్నీసా, రాములేటి మస్తాన్‌వలి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రచారం.. మార్కాపురం: వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ చిర్లం చర్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలోని వివేకానంద స్కూల్, సత్యనారాయణస్వామి గుడి, రెడ్డి కళాశాల, 10వ వార్డు, శ్రావణి హాస్పిటల్ ఏరియా, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు బొగ్గరపు శేషయ్య, ఊటుకూరి రామకృష్ణ, కె.కృష్ణ, ఆర్.తిరునారాయణ, ఆర్.రమేష్, సీహెచ్ నాగరాజు, కాళ్ల ఆది, సీహెచ్ రమేష్, ఇమ్మడిశెట్టి వీరారావు పాల్గొన్నారు. కేపీ కుటుంబ సభ్యుల ప్రచారం పట్టణ శివార్లలోని పూలసుబ్బయ్య కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో కుందురు నాగార్జునరెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరు తూ కౌన్సిలర్ బుశ్శెట్టి నాగేశ్వరరావు, రావి శివారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. కేపీ కుటుంబ సభ్యులైన అరుణ, కల్పన, పద్మావతి, బూత్ కన్వీనర్ ఎస్.రవి కుమార్, మాజీ కౌన్సిలర్ డి.కాశింపీరా, డి.మార్క్, కాశయ్య, నాగరాజు, నారాయణ పాల్గొన్నారు. తర్లుపాడులో.. తర్లుపాడు: రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునరెడ్డి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేపీ కొండారెడ్డి కుమార్తె అరుణ కోరారు. మండలంలోని మీర్జాపేట పంచాయతీ పరిధిలోని కారుమానుపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి, చిన్న కొండారెడ్డి, సరస్వతి, లక్ష్మి, డి.భాస్కరరెడ్డి, ఎర్రారెడ్డి, గాదె శ్రీనివాసరెడ్డి, వెన్నా శివారెడ్డి, తాతిరెడ్డి మల్లారెడ్డి, గాలిరెడ్డి, దొండపాటి వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనకనమిట్ల: మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ఉడుముల నారాయణమ్మ, మాజీ సర్పంచ్ ఉడుముల గురవారెడ్డి, మోరా శంకరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గొట్లగట్టు, నాయుడుపేట, తువ్వపాడు, చౌటపల్లి గ్రామాల్లో నాగార్జునరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం కోసం, జగనన్న ముఖ్యమంత్రిగా రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపంచాలని ఆయా గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మండల పార్టి ఉపాధ్యక్షుడు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మోరా శంకరరెడ్డి, నాయకులు ఎం.రంగస్వామి, కల్లం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
సీఏలను ఫైనాన్స్ అడ్వైజర్లుగా పిలవాలి
హైదరాబాద్: చార్టెడ్ అకౌంటెంట్ల(సీఏ)ను అకౌంటెంట్లుగా కాదు ఫైనాన్స్ అడ్వైజర్లుగా పిలవాలని, అందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లెన్స్ సెంటర్లో ఐసీఏఐ 2018–19 స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఏ కోర్సులు పూర్తి చేసిన 1,026 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 1949 చట్టంలోని సెక్షన్ 7లో సీఏలను ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మార్చేందుకు ఐసీఏఐ కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విలువలు, చట్టానికి అనుబంధం ఉంటుందని, విలువలతో కూడిన వృత్తిలో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడేతత్వం అలవర్చుకుని ముందుకు సాగితే ఎలాంటి విజయాన్ని అయినా సాధించగలరని చెప్పారు. దేశహితం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సూచనలు, సలహాలు సీఏలు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం.దేవరాజ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సీఏ 50 శాతం విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, మరో 50 శాతం నైపుణ్యాన్ని అప్డేట్ చేసుకుంటేనే బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఫల్గుణకుమార్, సీఎస్.శ్రీనివాస్, ఐసీఏఐ ప్రతినిధులు చెంగల్‌రెడ్డి, మస్తాన్, లక్ష్మీనాథ్ శర్మ, రితేష్, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కాటసానికి పుత్రశోకం
సాక్షి, బనగానపల్లె : వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి పుత్రశోకం కలిగింది. పెద్దకుమారుడు నాగార్జునరెడ్డి(26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులకు కుమార్తెలు ప్రతిభ, ప్రణతి, కుమారులు నాగార్జునరెడ్డి, ఓబుళరెడ్డి ఉన్నారు. కుమార్తెలద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భార్యే ప్రతిభ. నాగార్జునరెడ్డి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్, బెంగళూరులో రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు వచ్చాడు. రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. అయితే ఉదయం 10 గంటలైనా గది నుంచి బయటకురాకపోవడంతో కుటుంబ సభ్యులు గది వద్దకు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. కన్నీటి పర్యంతమైన కాటసాని దంపతులు పెద్దకుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండడంతో కాటసాని రామిరెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకొని కాటసాని దంపతులను ఓదార్చారు. విషయం తెలిసిన క్షణాల్లోనే కాటసాని నివాసం జనసంద్రమైంది. ప్రముఖుల నివాళి.. కాటసాని నాగార్జునరెడ్డి మృతదేహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్సీపీ పత్తికొండ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నేత గంగుల నాని, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసార«థిరెడ్డి, నంద్యాల టీడీపీ నాయకులు శ్రీధర్‌రెడ్డి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. దహన సంస్కారాలు: పట్టణ శివారులోని అవుకు రోడ్డులో ఉన్న కాటసాని సొంత స్థలంలో నాగార్జునరెడ్డికి సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునరెడ్డి బలవన్మరణంతో కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. బీటెక్ పూర్తి చేసిన నాగార్జున ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. నిన్నరాత్రి కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన కుమారుడు.. తెల్లవారేసరికి విగతజీవిగా మారడంతో కాటసాని రామిరెడ్డి కుటుంబం షాక్‌కు గురైంది. నాగార్జునరెడ్డి ఆత్మహత్యకు గత కారణాలు తెలియరాలేదు. కాగా, కాటసాని నాగార్జున రెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డిలు నివాళులు అర్పించారు. -
న్యాయానికే న్యాయం దక్కనప్పుడు..!
జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డిపై పార్లమెంట్లో రెండోసారి అభిశంసన తీర్మానం తీసుకురావడానికి విఫలయత్నం జరిగినట్లు వార్తలొచ్చాయి. కొద్ది మంది రాజకీయ నాయకుల కారణంగా ఆయన రుజువర్తన రెండోసారి కూడా ప్రశ్నార్థకమవడం శోచనీయం. ఇది ఆయన ఒక్కరిని శంకించడం కాదు, సమస్త న్యాయవ్యవస్థ స్వతంత్రతనూ శంకించడమే అవుతుంది. ఒక న్యాయమూర్తిని అభిశంసన ప్రక్రియ ద్వారానే తొలగించవచ్చు. ఈ అభిశంసన తన సుదీర్ఘ ప్రక్రియలో విఫలమైనప్పటికీ, దానికి గురైన వ్యక్తి సమాజం దృష్టిలోకి రావడమే కాకుండా ఆయన రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటుంది కూడా. ఇలాంటి సమస్యలను కొందరు పెద్దగా పట్టించుకోరు కానీ కొందరు అత్యంత సున్నిత స్వభావంతో ఉంటారు. జస్టిస్ నాగార్జున వీటిలో రెండో కోవకు చెందుతారు. రాజ్యాంగం ప్రకారం జడ్జిని అభిశంసన చేయాలంటే ఉభయ సభలూ దానిపై చర్చిం చిన తర్వాత పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంది. న్యాయమూర్తి దుష్ప్రవర్తన లేదా అసమర్థత రుజువైందన్న ప్రాతిపదికపై ఆయనను పదవీ బాధ్యతలనుంచి తొలగించవలసి ఉంటుంది. ఇక్కడ నాగార్జున రెడ్డిపై దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణ ఏదంటే ఒక దళిత జూనియర్ సివిల్ జడ్జిని ఆయన వేధించారన్నదే. ఆ సివిల్ జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డిపై పెట్టిన రిట్ పిటిషన్ నేపథ్యంలో ఆ ఆరోపణను పరిశీలించవలసి ఉంది. జస్టిస్ నాగార్జునరెడ్డిని అభిశంసించవలసిందిగా కోరుతూ సివిల్ జడ్జి రెండోసారి కూడా పిటిషన్ దాఖలు చేసినప్పడు, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇలా అభిప్రాయపడింది. చట్టప్రకారం రిట్ పిటిషన్‌పై తుది నిర్ణయాన్ని పొందడం మీద కాకుండా రిట్ పిటిషన్‌ను ఏదోలాగా కొనసాగిస్తూ, సమస్యను సజీవంగా ఉంచడంపైనే రిట్ పిటిషన్ దారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని స్పష్టమవుతోంది. జస్టిస్ నాగార్జున రెడ్డి గతంలో తనకు కాల్ చేసి ఒక మరణ వాంగ్మూల పత్రం నుంచి తన సోదరుడి పేరును తొలగించాలని ఆదేశించారనీ, దానిని తిరస్కరించడంతో తనపై వేధింపులు మొదలెట్టారని, సస్పెన్షన్ చేయించారని ఫిర్యాదిదారు ఆరోపించారు. పిటిషన్ ప్రకారం ఫిర్యాదుదారు నిజంగానే బాధపడి ఉంటే, ఆయనే మరొకరిని అదే విధమైన బాధకు గురి చేయడం దేనికని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. రిట్పిటిషనర్ తన అఫిడవిట్లో పేర్కొన్న వివిధ నివేదనల్లో కేవలం మూడింట్లో మాత్రమే న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. ఆ మూడు ఫిర్యాదుల సారాం శం ఒక్కటే. అదేమంటే 13.02.2013న జస్టిస్ నాగార్జున రెడ్డి తన కింది జడ్జి అయిన పిటిషన్ దారును రాయచోటిలోని తన ఇంటికి రప్పించి వేధించారన్నదే. దిగువ కోర్టు సిబ్బందిపై క్రిమినల్ ఫిర్యాదులు ఎందుకు నమోదు చేశావంటూ ఫిర్యాదుదారును వేధింపులకు గురి చేశారని ఆరోపణ. న్యాయ మూర్తికి వ్యతిరేకంగా ఫిర్యాదుదారు చేసిన నివేదికపై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ 14.02.2013 తేదీతో ఉన్న నివేదన ఈ మొత్తం వ్యవహారం కట్టుకథ అనడానికి నికరమైన రుజువు అని తేల్చింది. పిటిషనర్ 18.02.2013న తన తొలి నివేదనను కోర్టుకు పంపారు. ప్రతివాది (జస్టిస్ నాగార్జునరెడ్డి) రాయచోటిలోని తన ఇంటికి పిటిషనర్‌ను పిలిపించి, అవమానించారన్న విషయం దాన్లో లేదు. కిందిస్థాయి సిబ్బందికి వ్యతిరేకంగా నేరారోపణను నమోదు చేసినందుకు పిటిషనర్‌ను దూషించినట్లు ఈ నివేదనలో పొందు పరచలేదు. తర్వాత ఈ లోపాన్ని గుర్తించిన పిటిషనర్ 14.02.2013 తేదీతో కొత్తగా ఒక ఫిర్యాదును సృష్టించి రిట్ పిటిషన్‌ను ఫైల్ చేశారు. 18.02.2013న అఫిడవిట్లో పొందుపర్చిన అసలు ఫిర్యాదును ఈ రిట్ పిటిషన్లో తొక్కి పెట్టారు. మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన మరణ వాంగ్మూలంపై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, ఫిర్యాదుదారు ప్రకారం, మరణ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి 95 శాతం కాలిన గాయాలతో ఉన్నారనీ, అలాంటి వ్యక్తి మరణ వాంగ్మూలం ఇవ్వడానికి స్పృహలో ఉంటారా అనేది స్పష్టం కాలేదని పేర్కొంది. హైకోర్ట్ బెంచ్ మళ్లీ ఇలా పేర్కొంది. ‘అన్ కాన్షియస్’లో అన్ పదాన్ని, ‘ఇన్ ఎ ఫిట్ కండిషన్’ అనే పదాలకు ముందు నాట్ అనే పదాన్ని చేతితో కొట్టేశారు. మరోరకంగా చెప్పాలంటే, రోగి స్పృహలో లేడని, కాబట్టి అతడు మరణ వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేడని డ్యూటీ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను వ్యతిరేక అర్థం వచ్చే రీతిలో మార్చారని హైకోర్టు బెంచ్ ఎత్తి చూపింది. నా దృష్టిలో అభిశంసనకు గురైనవారు గొప్ప వ్యక్తి. తనకు కలిగిన సంక్షోభంపై కూడా ఆయన ఎంతో సమతుల్యతను ప్రదర్శించారు. తొలిసారి అభిశంసనకు గురైన వెంటనే తన అధికారిక విధులనుంచి తప్పుకున్నారు. కాగా, రెండో అభిశంసన నిర్ధిష్ట రూపం తీసుకోలేదు. ముందే చెప్పినట్లు న్యాయవ్యవస్థను మొత్తంగా పార్లమెంట్ సభ్యుల సంఖ్యాబలానికి వదలిపెడుతున్నారా? విచారణ జరిగే కాలంలో న్యాయమూర్తి కనీస నైతిక కారణాలతో విధి నిర్వహణకు దూరంగా ఉంచడం అంటే ఏమిటీ? అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి అంశాలపట్ల ఎందుకు మౌనం పాటిస్తున్నారు. వింతగొలిపే విషయం ఏమిటంటే మన వ్యవస్థలో ఇదే న్యాయం. న్యాయానికీ ఇదే న్యాయమే మరి. వ్యాసకర్త హైకోర్టు సీనియర్ న్యాయవాది రవిచంద్