కొడకండ్ల: తన సోదరి ధరావత్ ప్రీతి మృతిపై పారదర్శకంగా విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రీతి సోదరుడు ధరావత్ వంశీ(పృథ్వీ) డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై జరుగుతున్న విచారణ పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో గురువారం ఆయన మాట్లాడుతూ మా అక్కది హత్య అనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని, గూగుల్‌లో డ్రగ్స్ గురించి సెర్చ్ చేసిందనడానికి ఏం ఆధారాలున్నాయో చెప్పాలని ప్రశ్నించారు.
ముగ్గురు డాక్లర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని చెబుతున్నారని ఇది అవాస్తవమని, కౌన్సెలింగ్ చేసినట్లయితే మా అక్క తమతో చెప్పేదని, ఫోన్ ఆధారాలున్నాయని చెప్పారు సైఫ్ మా అక్కకు రెస్ట్‌లెస్ డ్యూటీలు వేయాలని తోటి డాక్టర్లకు చెప్పాడని పేర్కొన్నారు. నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేసి ప్రీతి ఘటనపై పారదర్శకంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment