
ప్రతీకాత్మక చిత్రం
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ఉన్నత చదువులు చదువుకోవాలని తల్లి చెప్పిన మాటలు నచ్చక ఓ యవతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పరిధిలోని తర్లుపాడు రోడ్డులో సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నాగలక్ష్మీ కూతురు సాయిసింధు డిగ్రీ పూర్తి చేసింది. పీజీ చదవాలని తల్లి సూచించగా ఇష్టం లేదని చెప్పింది.
ఉన్నత చదువులు చదివితే ఉద్యోగం వస్తుందని, పీజీలో చేరేందుకు కళశాలకు వెళ్లాలని తల్లి గురువారం మరోసారి నచ్చజెప్పింది. చదవడం ఇష్టం లేని సింధు తల్లి బయటకు వెళ్లగానే లోపల తలుపు గడియ వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తలుపులు మూసి ఉండటంతో ఆందోళన చెంది పగులగొట్టింది. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి బోరున విలపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శశికుమార్ తెలిపారు.
చదవండి: గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే?
Comments
Please login to add a commentAdd a comment