మార్కాపురం : సిగరెట్ తాగిన ఓ వ్యక్తి దానిని ఆర్పేయకుండా నిర్లక్ష్యంగా పక్కన పడేయటంతో మంటలు వ్యాపించి ఇంటికి అంటుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన పెదచెంచయ్య ఇంట్లో కూర్చుని సిగరెట్ తాగాడు.
అనంతరం దానిని ఆర్పి పడేయకుండా నిర్లక్ష్యంగా పక్కనే ఉన్న చెత్తలో పడేశాడు. అది రాజుకుని ఇంటికి అంటుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అప్రమత్తమయ్యేలోగా మంటలు వ్యాపించాయి. ఇంటితోపాటు సామాను కూడా తగలబడింది. కాగా ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
పారేసిన సిగరెట్.. ఇంటిని కాల్చేసింది...
Published Fri, Apr 3 2015 6:48 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement