సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలోని బట్టువారిపల్లి కి చెందిన శ్రీ రాములు నాలుగు రోజుల క్రితం తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ క్రమంలో శనివారం డిశ్చార్జి కావలసి ఉండగా అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ పాపను ఆస్పత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకు వెళ్లారు. అనంతరం శ్రీ రాములును భోజనం తెమ్మని చెప్పారు. అయితే, అతడు తిరిగి రాగా పాప కనిపించడం లేదంటూ వైద్య సిబ్బంది తెలపడంతో నిర్ఘాంతపోయాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా పోలీసులు, పాపను ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.
చదవండి: సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్
Comments
Please login to add a commentAdd a comment