మార్కాపురం, న్యూస్‌లైన్: పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక బ్రహ్మం గారి మఠం ప్రాంతానికి చెందిన 300 మంది తెలిపారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి సమక్షంలో వారంతా గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు.
కాలనీకి చెందిన వేశపోగురాజు మాట్లాడుతూ తమ ప్రాంతం లో సీసీరోడ్లు, కాలువలు, వాటర్ లైన్స్, మరుగుదొడ్లు, శ్మశానాలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, ఉన్నత తరగతులు ఏర్పాటు చేయాలని గతంలో వార్డుల నాయకులకు చెప్పినా పట్టించు కోలేదన్నారు. కాలనీల్లోని సమస్యలు పరిష్కరించగల సత్తా ఉన్న వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కటికెల గురవయ్య, కొండేటి ఆవులయ్య, ఎన్.డేవిడ్, గుంటి దేవరాజు, వి.శేఖర్, బి.నారాయణ, జి.రంగయ్య, డి.పేతురు, పి.రాముడు తదితరులు పార్టీలో చేరారు.
ఏకలవ్య కాలనీలో..
టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొమ్ము యోగమ్మ నేతృత్వంలో ఏకలవ్యకాలనీలో సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిల నేతృత్వంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే నూతన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు వారు తెలిపారు. డేవిడ్, పౌల్‌రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.
31వ వార్డులో..
స్థానిక కాలేజీ రోడ్డులోని 31వ వార్డులో సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వంగూరి రూతమ్మ నేతృత్వంలో గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీలో చేరారు. నందిగం డేవిడ్, ఆదిమూలపు క్రిష్టయ్య, వంగూరి జానీ, ఏసోబు, అఖిల్, ప్రశాంత్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఆర్.తిరునారాయణ, ఎం.మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, పాపిరెడ్డి సుబ్బారెడ్డి, గొలమారి శివారెడ్డి, ఇంజినీర్ వెంకటరెడ్డి, కురాటి చెన్నకేశవులు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, గుంటక వెంకటరెడ్డి, కంది ప్రమీలారెడ్డి, ఆవులమంద పద్మ, ఒంటెద్దు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 31వ అభ్యర్థి జి.రోజ్‌లిడియాతో కలిసి డాక్టర్ కనకదుర్గ ప్రచారం నిర్వహించగా ర్యాలీలో కేపీ, జంకె, వెన్నా హనుమారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం
17వ బ్లాక్‌లో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి సతీమణి కె.సుబ్బమ్మ గురువారం రాత్రి ప్రారంభించారు. అభ్యర్థి బుశ్శెట్టి నాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు ఎంవీ రమణ, ఇస్మాయిల్, బొందిలి కాశిరాంసింగ్, కనిగిరి వెంకటేశ్వర్లు, పెండ్యాల వెలుగొండయ్య, వెంకటేశ్వర్లు, రిటైర్డ్ తహసీల్దార్ హుస్సేన్‌పీరా, షేక్ మన్సూర్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
మార్కాపురంలో వలసల జోరు
Published Fri, Mar 21 2014 3:11 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement