కందకాలపై అవగాహన సదస్సులు | Sakshi Awareness Seminars on Trenches | Sakshi
Sakshi News home page

కందకాలపై అవగాహన సదస్సులు

Published Tue, May 17 2016 9:57 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sakshi Awareness Seminars on Trenches

మార్కాపురం: ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ, ఏపీ-తెలంగాణ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాలతో నీటి సంరక్షణపై రైతు అవగాహన సదస్సులు మంగళవారం నిర్వహించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలంలో అనుములవీడు గ్రామంలోని కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు, మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం 4 గంటలకు అవగాహన సదస్సులు జరుగుతాయి.

ఈ సదస్సుల్లో ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్‌చార్జి పి.రాంబాబు, ఇంజినీర్ల సంఘం కార్యదర్శులు, విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు, డ్వామా, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొని రైతులకు నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులకు రైతులందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement